
సాక్షి,బోధన్ (నిజామాబాద్ ): అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం బోధన్ పట్టణంలో గంగపుత్ర కుల సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళన సభ విచ్చేసిన ఎంపీ కవిత టీఆర్‌ఎస్ ప్రభుత్వం మత్స్యకారులకు అందించిన మోపెడ్‌ను సరదాగా నడిపారు. అనంతరం సభలో పాల్గొన్నారు.
హమ్మయ్య.. టిఫిన్ కోసం సమయం దొరికింది!
సాక్షి,బాన్సువాడ (నిజామాబాద్): ఎన్నికల సమయం కావడంతో తెల్లవారుజాము నుంచి రాత్రి పడుకునే వరకు అభ్యర్థులకు తీరిక ఉండదు. పార్టీ నాయకులు, ప్రజలు, కార్యకర్తలతో బిజీబిజీగా ఉంటారు. ఇక బాన్సువాడ టీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మరింత బిజీగా ఉన్నారు. కేవలం నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయనపై ప్రచార బాధ్యతలు ఉండడంతో చాలా బిజీగా మారారు. శనివారం తెల్లవారుజామునే పట్టణంలోని శ్రీవేంకటేశ్వరాలయంలో భార్య సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రిని, ఆలయ కమిటీ వారు టిఫిన్ చేసి వెళ్లాలంటూ ఆత్మీయంగా ఆహ్వానించడంతో ఆయన అంగీకరించి కాస్త తీరికగా టిఫిన్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment