ఎండా, వానలతో జాగ్రత్త: రైల్వే జీఎం వినోద్
సాక్షి, హైదరాబాద్: ఎండ తీవ్రత అధికంగా ఉండే మే నెల, వచ్చే వానాకాలాలను దృష్టిలో ఉంచుకు ని నిరంతరం జాగరూకతతో వ్యవహ రించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ సూచించారు. సోమవారం రైల్ నిలయంలో అన్ని డివిజన్ల డీఆర్‌ఎంలు, ఉన్నతాధి కారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే 20 రోజుల్లో ఎండ తీవ్రత గరిష్టంగా ఉండనున్నందున పట్టాల పగుళ్లు, జాయింట్ల వెల్డింగులు పరిశీలించాలన్నారు.
వానాకాలంలో మెరుపు వరదలను అధిగమించేం దుకు ప్రణాళికలు అవసరమని పేర్కొ న్నారు. అప్రమత్తంగా వ్యవహరించి నందుకు గాను విజయవాడ డివిజన్ తాడేపల్లి గూడేనికి చెందిన ఉద్యోగి శ్రీనివాసరావుకు జీఎం ప్రశంసాపత్రం అందజేసి సన్మానించారు.