సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండగా, మరోవైపు కొన్నిచోట్ల ఎండలు కొనసాగుతున్నాయి. వడగాడ్పుల హెచ్చరికలు లేకపోవడంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు. రానున్న 4 రోజులు అక్కడక్కడ ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 24 గంట ల్లో కొత్తగూడెంలో 2 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
నవాబుపేట, అశ్వారావుపేట, చంద్రు గొండ, టేకుల పల్లి, మద్దూరు, మోమినిపేట, నారాయణపేట్‌లలో ఒక సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్‌లో 43 డిగ్రీలు, నిజామా బాద్‌లో 42.5, రామగుండంలో 42.4, నల్లగొండలో 42, మెదక్, మహబూబ్‌నగర్, ఖమ్మంలలో 41, హైదరాబాద్‌లో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
ఒకవైపు వర్షాలు.. మరోవైపు ఎండలు
Published Tue, May 9 2017 1:01 AM | Last Updated on Tue, Sep 4 2018 5:02 PM
Advertisement