బ్యూటిప్స్
వేసవిలో అక్కడక్కడా వర్షాలూ పడుతున్నాయి. ఎండ, ఉక్కపోత, వర్షం.. ఈ కాలం మేకప్ వేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. చెమట వల్ల అసౌకర్యంగా ఉండటమే కాకుండా ముఖసౌందర్యం కోల్పోతామేమో అనే సమస్య కూడా తలెత్తుతుంది. ఈ కాలం మేకప్ వేసుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి....
మేకప్ చేసుకునేముందు ఫేస్ వాష్‌తో ముఖాన్ని ఒకసారి శుభ్రం చేస్తే చాలు. ఒకటికి మూడు సార్లు కడిగి, మరీ చర్మం పొడిబారేలా చేయకూడదు.ఈ కాలం చెమట అధికం కనుక వాటర్‌ప్రూఫ్ మేకప్ సామగ్రిని ఎంచుకోవాలి. నప్పుతుందో మీ చర్మం రంగును బట్టి మీకు నప్పే స్కిన్ షేడ్‌ను, ఫౌండేషన్, ప్రైమర్, కన్సీలర్‌లను ఎంచుకోవాలి.ముందు బేస్‌గా ప్రైమర్‌ని ముఖమంతా రాయాలి. దీని వల్ల పోర్స్ వెడల్పు అవుతాయి. మొటిమల వల్ల అయిన మచ్చలు, ఫైన్ లైన్స్, ముడతల ు కనిపించవు. ఫౌండేషన్‌కి మాయిశ్చరైజర్‌గా ప్రైమర్ పనిచేస్తుంది. మేకప్ ఎక్కువ సమయం పాడవకుండానూ ఉంటుంది. ఫౌండేషన్ ప్యాచులుగా చర్మానికి పట్టే సమస్య కూడా ఉత్పన్నం అవదు.
నిద్రలేమి, ఒత్తిడి కారణంగా కళ్లకింద చర్మం ఉబ్బు ఉంటే మేకప్ వేసుకోకూడదు. ఆ వాపు తగ్గడానికి గోరువెచ్చని టీ బ్యాగ్‌తో కొద్దిసేపు కాపడం పెట్టాలి. డార్క్ ఐ లైనర్‌తో కళ్లను తీర్చిదిద్దాలి. లిప్‌స్టిక్ తర్వాత లిప్‌గ్లాస్‌ను కూడా ఉపయోగించాలి.ఈ కాలం మెరుపుల కోసం ఏ ఇతర గ్లిటర్స్‌ని ఉపయోగించకపోవడమే మంచిది. ముఖంలో కనిపించేవి ముందు పెదాలు, కళ్లు మాత్రమే. అందుకే లిప్‌స్టిక్, ఐ షాడో, మస్కారాలను ఉపయోగించేటప్పుడు శ్రద్ధ తీసుకోవాలి.