హైదరాబాద్(కాచిగూడ): కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చిన సంఘటన ఆదివారం ఉదయం జరగింది. రైల్వే ఇన్‌స్పెక్టర్ సి.లింగన్న తెలిపిన వివరాల ప్రకారం... తాండూరు ప్రాంతానికి చెందిన మానస (38) పురుటినోప్పులు రావడంతో కాన్పుకోసం నగరంలోని ఆసుపత్రిలో చూపించుకోవడానికి తల్లితో కలిసి వచ్చింది.
తాండురులో ఎంఎంటిఎస్ రైలు ఎక్కి కాచిగూడ రైల్వే స్టేషన్‌లో దిగింది. రైల్వే స్టేషన్‌లో ఫుట్‌ఓవర్ బ్రిడ్జి ఎక్కి నడుచుకుంటూ వస్తుండగా నోప్పులు ఎక్కువై పుట్ ఓవర్‌బ్రిడ్జిపైనే కవల పిల్లలు ఒక బాబు, ఒక పాపకు జన్మనించింది. తల్లి ఇద్దరు పిల్లలు క్షేమంగా ఉన్నారు. రైల్వే పోలీసులు చేరదీసి వారిని చికిత్స నిమిత్తం 108లో గాంధి ఆసుపత్రికి తరలించారు.
రైల్వే స్టేషన్‌లో ప్రసవించిన మహిళ
Published Sun, May 3 2015 4:22 PM | Last Updated on Thu, Apr 4 2019 4:44 PM
Advertisement
Advertisement