rail coaches
-
రద్దీ కోచ్‌లు.. మురికి మరుగుదొడ్లు.. వీడియోలు వైరల్
పండగ రద్దీ భారతీయ రైల్వేకు నిత్యం పెద్ద సవాలుగా మారుతోంది. పండగ నేపథ్యంలో లక్షలాది మంది స్వస్థలాలకు, బంధువుల ఇళ్లకు ప్రయాణిస్తుంటారు. రైల్వేశాఖ అందుకు అనుగుణంగా సాధారణ రైళ్లతో పాటు, ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. కానీ ఎప్పటిలాగే పండగ రోజుల్లో ప్రయాణికుల అవసరాలను మాత్రం తీర్చలేకపోతోంది. దాంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా దీపావళి నేపథ్యంలో అదే తంతు కొనసాగింది. కొంతమంది ప్రయాణికులు అందుకు సంబంధించిన వీడియోలు తమ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అవి వైరల్‌గా మారాయి. Bihar govt should now run special trains for their native migrant labors . There are people who paid for AC 2 n 3 tickets but couldn't board cause these chalu ticket climbed overcrowded the train n shut the door. and as usual Indian Railway management was clueless https://t.co/hLuRWQyz3d — Romeo Sierra (@sierraromeo98) November 11, 2023 PNR 8900276502 Indian Railways Worst management Thanks for ruining my Diwali. This is what you get even when you have a confirmed 3rd AC ticket. No help from Police. Many people like me were not able to board. @AshwiniVaishnaw I want a total refund of ₹1173.95 @DRMBRCWR pic.twitter.com/O3aWrRqDkq — Anshul Sharma (@whoisanshul) November 11, 2023 Why should I pay extra reservation charges if this is how I have to travel after paying extra charge for reservation. I m not demanding Tejas Coach Services, i demand my reserved seat #IndianRailways #resign https://t.co/sOjTgPdo9v — yogita chulet (@YogitaChulet) November 9, 2023 -
కాచిగూడలో రెస్టారెంట్‌గా మారిన రైల్వే కోచ్.. తెలంగాణలోనే తొలిసారి
సాక్షి, హైదరాబాద్:/కాచిగూడ: ట్రైన్లో కూర్చొని భోజనం చేస్తున్న అనుభూతిని నగరవాసులు ఇకనుంచి ఫీల్ కావొచ్చు. ప్రస్తుతం సిటీలో అందుబాటులో ఉన్న జైల్‌మండి, రైల్ మండి తరహాలో కాచిగూడ రైల్వేస్టేషన్లో పరివార్ ఫుడ్ ఎక్స్‌ప్రెస్ పేరిట ట్రైన్ రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. 24 గంటలూ ఈ రెస్టారెంట్లో సేవలు అందుబాటులో ఉంటాయి. రెండు కోచ్‌లతో ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేయగా, ఇందులో సుమారు 120మంది వరకూ కూర్చోవచ్చు. కాచిగూడ రైల్వేస్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన ఈ ‘థీమ్ హోటల్’తో రైల్వేస్టేషన్‌కు మరింత అందం సంతరించింది. తెలంగాణలోనే ఇది మొట్టమొదటిసారి రైల్వే కోచ్‌లలో ఏర్పాటు చేసిన హోటల్ కావడం విశేషం. ఐదు సంవత్సరాల కాలపరిమితి కోసం సికింద్రాబాద్‌కు చెందిన మెస్సరస్ పరివార్స్ హావ్ మోర్‌కు ఈ రెస్టారెంట్ కోచ్‌లను లీజ్‌కు ఇచ్చారు. బంగారు వర్ణంతో కోచ్‌ల అలంకరణ నిజాంకాలంనాటి ఈ హెరిటేజ్ కోచ్‌లను బంగారు వర్ణంతో అందంగా అలంకరించారు.హెదరాబాద్ బిర్యానీతోపాటు, ఉత్తర, దక్షిణాది, చైనీస్, మొఘలాయ్లాంటి బహుళ వంటకాల ఎంపికలతో కూడిన ఈ రెస్టారెంట్ భోజనప్రియులను ఎంతో ఆకట్టుకుంటుందని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ డివిజన్ అధికారుల కృషిని అభినందించారు. The @SCRailwayIndia started #RestaurantOnWheels, a train themed #restaurant at Kacheguda Rly Stn in #Hyderabad to offer a novel experience to food connoisseurs, providing them with a unique dining ambience 24 hrs. 2 heritage coaches have been refurbished with aesthetic interiors. pic.twitter.com/5nMCJ67j8d — Surya Reddy (@jsuryareddy) July 25, 2023 Quick Glimpses on Restaurant on Wheels' at #Kacheguda Railway Station#RestaurantOnWheels @drmhyb @RailMinIndia @AshwiniVaishnaw @drmsecunderabad @PIBHyderabad pic.twitter.com/3jwdowo8bk — South Central Railway (@SCRailwayIndia) July 25, 2023 -
ఐసోలేషన్ కేంద్రాలుగా రైల్వే కోచ్‌లు
న్యూఢిల్లీ: కరోనాను ఎదుర్కొనేందుకు రైల్వే శాఖ 2,500 కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చింది. మొత్తం 5 వేల కోచ్‌లను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకోగా మొదటి దశలో భాగంగా 2,500 కోచ్ లను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చినట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది. వీటితో కొత్తగా 50 వేల ఐసోలేషన్ బెడ్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది. 133 ప్రాంతాల్లో రోజుకు 375 కోచ్ లను బెడ్లుగా మారుస్తున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది. వైద్యుల సూచనల మేరకు పూర్తి స్థాయిలో వైద్య పరికరాలతో రూపొందించినట్లు వెల్లడించింది. -
ఎంఎంటీఎస్ రైళ్లకు కొత్త లుక్
సాక్షి, హైదరాబాద్: దశాబ్దన్నర కాలంగా నగర రవాణాలో భాగమైన ఎంఎంటీఎస్ రైలు బోగీలు కొత్త రంగులతో మెరిసిపోనున్నాయి. ఎంఎంటీఎస్ రైళ్ల లుక్‌ను మార్చాలని రైల్వే నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ప్రయోగాత్మకంగా కొత్త లుక్‌తో కొన్ని బోగీలు రూపొందించి నగరానికి చేర్చింది. ప్రస్తుతం మౌలాలిలోని ఈఎంయూ కార్‌షెడ్‌లో ఉన్న కొత్త ఎంఎంటీఎస్ రేక్‌ను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా బుధవారం పరిశీలించారు. ఇప్పటి వరకు తెలుపు రంగుపై నీలి రంగు స్ట్రిప్‌తో బోగీలు నడుస్తున్నాయి. మధ్యలో మహిళా ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన బోగీలకు గులాబీ రంగు వేయించారు. ఇప్పుడు రైలు బోగీలకు కొత్త రంగులు రానున్నాయి. ప్రస్తుతం గులాబీ రంగు డిజైన్లతో ఉన్న బోగీలు వచ్చాయి. వాటిల్లో సీట్ల రూపాన్ని కూడా మార్చారు. సీటింగ్ సామర్థ్యాన్ని కూడా పెంచారు. ఈ కొత్త రైళ్లు త్రీ ఫేజ్ విద్యుత్‌తో నడుస్తాయి. వీటిల్లో కొన్ని ఆధునిక వసతులు కూడా కల్పించనున్నారు. తమిళనాడులోని పెరంబుదూర్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వీటిని రూపొందిస్తున్నారు. వీటిని పరిశీలించిన అనంతరం.. అధికారులు చేసే సూచనల ఆధారంగా మార్పుచేర్పులు చేసి పూర్తిస్థాయి కొత్త బోగీలను సరఫరా చేయనున్నారు. పనుల పురోగతిపై జీఎం సమీక్ష.. అల్వాల్ రైల్వే స్టేషన్లో కొనసాగుతున్న ఎంఎంటీఎస్ ఫేజ్–2 పనుల పురోగతిపై గజానన్ మాల్యా సమీక్షించారు. మౌలాలిలోని ఎలక్ట్రిక్ కార్‌షెడ్‌లో ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ (ఈఎంయూ) కోచ్ నిర్వహణ అవసరాలను గురించి సమగ్ర సమీక్ష జరిపారు. ఎంఎంటీఎస్ రేక్ మరమ్మతులు నిర్వహించే పీరియాడికల్ ఓవర్ హాలింగ్ షెడ్‌ను పరీక్షించారు. అనంతరం స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాలపై డీఆర్ఎంతో చర్చించారు. -
ఆ రైలు టిక్కెట్ ధర అక్షరాల రూ.2లక్షలు..
న్యూఢిల్లీ : రైలులో దూర ప్రయాణాలు చేసే వారికి శుభవార్త. రోజుల తరబడి చేసే ట్రైన్ జర్నీలు ఇప్పుడు సాఫీగా సాగిపోతాయి. ఇరుకిరుకు బోగీలలో అష్టకష్టాలు పడాల్సిన అవసరం లేదు. దూర ప్రయాణాలు చేసేవారి కోసం ‘‘ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్’’ (ఐఆర్సీటీసీ) కొత్తగా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లతో విలాసవంతమైన ‘‘స్వాంకీ సెలూన్ కోచ్’లను అందుబాటులోకి తెచ్చింది. ఈ బోగీలలో మీ ప్రయాణం ఎలా ఉంటుందంటే.. విశాలమైన ఏసీ గదులు, రూమ్ విత్ పర్నిచర్, అటాచ్డ్ బాత్రూం, పిలవగానే వచ్చే సేవకులు. మొత్తానికి ఓ లగ్జరీ హోటల్లో సూట్ రూమ్ బుక్ చేసుకున్నట్లు ఉంటుంది. సామాన్య పౌరునికి కూడా విలాసవంతమైన ప్రయాణాన్ని అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఐఆర్సీటీసీ వీటిని అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ బోగీలను ఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని జమ్మూ మేయిల్‌తో పాటు జతచేసి నడుపుతున్నారు. మొత్తం 336 సెలూన్ కోచ్‌లు ఉండగా వాటిలో 66ఏసీవి. ‘‘స్వాంకీ సెలూన్ కోచ్’లలో ప్రయాణించడానికి ‘‘ఐఆర్సీటీసీ’’ వెబ్సైట్లో వెళ్లి ఓ టిక్కెట్ బుక్ చేసుకుంటే సరి. ధర విషయానికొస్తే లగ్జరీ అంటున్నాం కాబట్టి.. డబ్బులు కూడా లగ్జరీకి తగ్గట్టుగానే చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో టిక్కెట్ ధర అక్షరాల రూ. 2లక్షలు.. 18 ఫస్ట్‌క్లాస్ టిక్కెట్లతో సమానం. అంటే ‘‘స్వాంకీ సెలూన్ కోచ్’లో ఒక్క టిక్కెట్ కొంటే ఫస్ట్‌క్లాస్ బోగీలలో 18సార్లు ప్రయాణించవచ్చు. -
రైలు బోగీల్లో అపరిశుభ్రతపై హైకోర్టు ఆగ్రహం
- ఫస్ట్ క్లాస్ బోగీల్లోనూ ఎలుకలు - టాయిలెట్స్ మరీ దారుణమని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: రైలు బోగీలు, ప్లాట్‌ఫాంల అపరిశుభ్రతపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫస్ట్‌క్లాస్ బోగీల్లో ఎలుకలు కూడా సంచరిస్తుండటంపై విస్మయం చెందింది. విశాఖ రైల్వే ప్లాట్‌ఫాంలో కాంట్రాక్టు వివాదంపై దాఖలైన వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. బిచ్చగాళ్లు, అనాథలు రైలు బోగీలు శుభ్రం చేసి ప్రయాణికుల నుంచి డబ్బు ఇవ్వమని వేడుకోవడం తాము కూడా చూశామని, మరుగుదొడ్ల పరిస్థితి చెప్పనలవి కాదని, వీటిని చక్కదిద్దాల్సిన సిబ్బంది ఏంచేస్తున్నారని రైల్వే అధికారులను ధర్మాసనం ప్రశ్నించింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంపై ఆహార పదార్థాల విక్రయానికి మహదేవ్ సేల్స్ ఏజెన్సీ కాంట్రాక్టు పొందింది. ప్రయాణికులు తిని వదిలేసిన ప్లేట్లను సదరు ఏజన్సీ సేకరించి తిరిగి వినియోగించే దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో రైల్వే అధికారులు స్పందించారు. సదరు కాంట్రాక్టు లైసెన్స్ రద్దు చేస్తూ, రూ.లక్ష జరిమానా విధించారు. దీనిపై మహదేవ్ సేల్స్ ఏజన్సీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ క్రమంలో రూ.లక్ష జరిమానా విధించినప్పుడు లైసెన్స్ రద్దు చేయడం సరికాదంటూ ఈ నెల 18న సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీనిపై రైల్వే అధికారులు అప్పీల్ చేశారు. తాత్కాలిక సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రైళ్లల్లో అపరిశుభ్రతపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కాంట్రాక్టు లైసెన్స్ రద్దు ఉత్తర్వుల్ని సింగిల్ జడ్జి సస్పెండ్ చేయడాన్ని కొట్టివేసింది. రైల్వేతో ఒప్పందంపై అభ్యంతరాలు ఉంటే ఆర్బిట్రేషన్ ద్వారా పరిష్కరించుకోవాలంది. -
పట్టాలు తప్పిన పూర్వ ఎక్స్‌ప్రెస్
కొల్కత్తా: హౌరా - న్యూఢిల్లీ పూర్వ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం పట్టాలు తప్పింది. హౌరా నుంచి బయలుదేరిన కొద్ది సేపట్టికే లిలూహ స్టేషన్ వద్ద ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 9 బోగిలు పట్టాలు తప్పాయి. అయితే ప్రయాణికులు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు. రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలో పలు రైళ్లను మరో మార్గంలో మళ్లీస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.