carried women
-
డోలీ కట్టి.. మూడు కిలోమీటర్లు
ఏటూరు నాగారం: డోలీ కట్టి మూడు కిలోమీటర్ల మేర ఓ గర్భిణిని కుటుంబసభ్యులు మోసుకొచ్చి, అనంతరం 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించిన ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. ఏటూరునాగారం మండలం రాయబంధం గొత్తికోయగూడేనికి చెందిన గర్భిణి సోది పోసికి ఆదివారంరాత్రి పురిటినొప్పులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని గ్రామస్తులు ఆశ కార్యకర్తకు తెలియజేయగా ఆమె 108 సిబ్బందికి సమాచారం ఇచ్చింది. గ్రామానికి సరైన రోడ్డుమార్గం లేకపోవడంతో అక్కడికి అంబులెన్సు రాదని సిబ్బంది చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మంచానికి తాళ్లుకట్టి డోలీగా మార్చి మూడు కిలోమీటర్ల దూరం మోసుకొచ్చారు. ఆ తర్వాత అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఎంత కష్టమొచ్చింది.. పాము కాటుకు గురైన మహిళను మంచంపై అలా..!
రాయ్‌పూర్: దేశంలోని చాలా ప్రాంతాలకు నేటికీ సరైన రోడ్డు మార్గం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాము కాటుకు గురైన ఓ మహిళను మంచంపై నడుములోతు నీటిలో మోసుకెళ్లిన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. భారీ వర్షాల కారణంగా స్థానిక వాగు పొంగింది. దీంతో ఆరోగ్య సిబ్బంది గ్రామానికి చేరుకోలేని పరిస్థితి తలెత్తటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ముంగేలి జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన గిరిజన మహిళ పాము కాటుకు గురైంది. అయితే, భారీ వర్షాల కారణంగా వాగు పొంగి ఇతర గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో చేసేదేమి లేక ఎనిమిది మంది గ్రామస్థులు మహిళను మంచంపై నడుములోతు నీటిలోంచి మోసుకెళ్తూ పక్క గ్రామానికి తీసుకెళ్లి చికిత్స అందించారు. మహిళను మంచంపై తీసుకెళ్తుండగా అదే మంచంపై మరోమహిళ సైతం ఉన్నట్లు చిత్రాల్లో కనిపిస్తోంది. ‘భారీ వర్షాల కారణంగా వాగు పొంగి పక్క గ్రామంలోని ఆరోగ్య సిబ్బంది ఆ గ్రామానికి చేరుకోలేకపోయారు. ఇది ప్రత్యేకమైన కేసు. వాగు పొంగటం వల్ల మహిళను మంచంపై మోసుకొచ్చారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ నిబంధనలు, 10-12 కోట్ల రూపాయల బడ్జెట్ కారణంగా వంతెన నిర్మాణం ప్రతిపాదనకు ఆమోదంలో జాప్యం జరుగుతోంది.’ అని తెలిపారు ముంగేలి అదనపు కలెక్టర్ తీర్థరాజ్ అగర్వాల్. Chhattisgarh| Villagers carry tribal woman bitten by a snake on a cot across river to reach hospital in Mungeli district Area is little difficult to reach & a village that has health officials was cut off from there due to heavy rains: Teerthraj Agarwal, Mungeli Addl Collector pic.twitter.com/BXikfRxCCf — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) September 19, 2022 ఇదీ చదవండి: షాకింగ్ వీడియో.. రహదారిపై వాహనాలను ఢీకొడుతూ వ్యక్తిని లాక్కెళ్లిన కారు -
ఉలిక్కిపడిన మక్తల్
మక్తల్ : మహబూబ్‌నగర్ ఎస్పీ అనురాధ ఆదేశాల మేరకు మక్తల్ పట్టణంలో నారాయణపేట డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు గురువారం రాత్రి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గురువారం రాత్రి 7 గం టల నుంచి దాదాపు 9 గంటల వరకు పోలీసు బృందాలు ఇళ్లలోకి వచ్చి తనిఖీలు చేపట్టడంతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 26 వాహనాలు, 20 తులాల బంగారం, 9 కిలోల వెండిని స్వా ధీనం చేసుకున్నారు. అలాగే గుట్కాలు, జీపులను స్వాధీనపరుచుకున్నారు. పట్టణంలోని ఎల్లమ్మకుంట, రాఘవేంద్రకాలనీల్లో ప్రతి ఇంటిలో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించి వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. పట్టణంలో రోడ్లపై అనుమానాస్పదంగా తిరుగుతు న్న పలువురు వ్యక్తుల ను అదుపులోకి తీ సుకుని వేలిముద్రలను సేకరించారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రజల రక్షణే ధ్యేయం.. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో పేట డీఎస్పీ శ్రీధర్ మా ట్లాడుతూ ప్రజల రక్షణే కార్డెన్ సెర్చ్ ప్ర ధాన లక్ష్యమన్నారు. కొత్తగా ఎవరైనా వ్య క్తులు ఇళ్లలో అద్దెకు వచ్చినా వారికి సం బంధించిన పూర్తి వివరాలు సేకరించాలన్నారు. కార్డెన్ సెర్చ్‌లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, ఆభరణాలకు సంబం ధించి యజమానులు సరైన పత్రాలు చూ యించి తీసుకెళ్లాలన్నారు. విడతల వారీ గా అన్ని ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ చేపడు తామన్నారు. తనిఖీల్లో సీఐ వెంకట్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, రామకృష్ణ, మరో ఇద్దరు సీఐలు, 11 మంది ఎస్ఐలు, 141 మంది సిబ్బంది పాల్గొన్నారు. -
భార్య శవాన్ని తోపుడు బండిపై తోసుకుంటూ..
లక్నో: మానవత్వం మసకబారుతోంది. డబ్బుకు ఉన్న పాటి విలువ మనిషి ప్రాణానికి లేకుండా పోయింది. ఒడిస్సాలో కొన్ని నెలల కిందట అంబులెన్స్‌కు డబ్బు చెల్లించే స్తోమత లేక ఓ వ్యక్తి తన భార్య శవాన్ని తన భుజంపై మోసుకుని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లటం అప్పట్లో అందరి మనసులను కదిలించింది. ఆ ఘటన మరవక ముందే అలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషాదంలో ఒకవైపు అంబులెన్స్ సిబ్బంది చేసిన ఆలస్యం నిండు ప్రాణాలు తీస్తే.. మరోవైపు వైద్యుల కర్కశత్వం కట్టుకున్న భార్య శవాన్ని కిలోమీటర్ల దూరానికి తోపుడు బండిలో తోసుకుంటూ తీసుకెళ్లేలా చేసింది. మంగళవారం నాడు మెయిన్‌పురి జిల్లాకు చెందిన 36 ఏళ్ల కన్హయ్యలాల్ తన భార్య సోనీ అస్వస్థతకు లోనవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. గంటలు గడిచిన అంబులెన్స్ రాకపోవడంతో భార్యను తోపుడు బండిపై తోసుకుంటూ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మెయిన్‌పురి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు మార్గం మధ్యలోనే చనిపోయిందని చెప్పడంతో ఒక్క సారిగా కప్పకూలాడు కన్హయ్య. గుండె దిటవు చేసుకొని భార్య శవాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని కోరినప్పటికి ఆస్పత్రి వర్గాలు అందుకు ఒప్పుకోలేదు. దినసరి కూలీగా పనిచేస్తున్న అతను చేసేదేమీ లేక భార్య శవాన్ని గుడ్డలతో చుట్టి తోపుడు బండిపై తోసుకుంటూ వెళ్లాడు. ఈ దృశాన్ని చూసిన అక్కడి ప్రజల కళ్లు చెమ్మగిల్లాయి వారు ఆస్పత్రి వర్గాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఈ ఘటనపై యూపీ వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి ప్రశాంత్ త్రివేది స్పందిస్తూ.. 108 అంబులెన్స్ నెంబర్‌కు ఎలాంటి ఫోన్ రాలేదన్నారు. కన్హయ్య చాలా పేదవాడు అతని దగ్గర ఫోన్ చేసేందుకు మొబైల్ కూడా లేదన్నారు. ఒకవేళ ఫోన్ చేసినా ఆస్పత్రికో లేదా వేరొక నెంబర్‌కో ఫోన్ చేసి ఉంటారని తెలిపారు. ఈ సంఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. -
సమయానికి రాని డాక్టర్లు.. గర్భిణీల ఇబ్బందులు
-
సమయానికి రాని డాక్టర్లు.. గర్భిణీల ఇబ్బందులు
విశాఖ: నగరంలోని ఘోషా ఆస్పత్రిలో గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం పరీక్షల నిమిత్తం వచ్చిన ఆ స్త్రీలు నానా అవస్థలు పడ్డారు. కొంతమంది ఎండ వేడిని తట్టుకోలేక పడిపోయారు. ఆస్పత్రికి వచ్చిన గర్భిణీలకు అక్కడ డాక్టర్లు కనిపించలేదు. 10 గం.లకు రావాల్సిన డాక్టర్లు సమయానికి అక్కడకు రాకపోవడంతో గర్భిణీలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలా క్యూలైన్లో నిల్చొని ఉన్న నలుగురు వేడిని తట్టుకోలేక సొమ్ముసిల్లి పడిపోయారు. ఆస్పత్రికి వైద్యులు తగిన సమయంలో రాకపోవడంతో వందలాది మంది గర్భిణీలు లైన్లలో నిల్చొని ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా ఒక పసికందు మృతి చెందింది.ఆ మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ ఆ బిడ్డ బంధువుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిడ్డ పుట్టినా తమకు చూపించలేదని, అసలు పసికందుకు వైద్యం చేయలేదంటూ ఆస్పత్రి బయట ఆందోళనకు దిగారు.