విశాఖ: నగరంలోని ఘోషా ఆస్పత్రిలో గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం పరీక్షల నిమిత్తం వచ్చిన ఆ స్త్రీలు నానా అవస్థలు పడ్డారు. కొంతమంది ఎండ వేడిని తట్టుకోలేక పడిపోయారు. ఆస్పత్రికి వచ్చిన గర్భిణీలకు అక్కడ డాక్టర్లు కనిపించలేదు. 10 గం.లకు రావాల్సిన డాక్టర్లు సమయానికి అక్కడకు రాకపోవడంతో గర్భిణీలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలా క్యూలైన్లో నిల్చొని ఉన్న నలుగురు వేడిని తట్టుకోలేక సొమ్ముసిల్లి పడిపోయారు. ఆస్పత్రికి వైద్యులు తగిన సమయంలో రాకపోవడంతో వందలాది మంది గర్భిణీలు లైన్లలో నిల్చొని ఇబ్బందులు పడుతున్నారు.
ఇదిలా ఉండగా ఒక పసికందు మృతి చెందింది.ఆ మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ ఆ బిడ్డ బంధువుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిడ్డ పుట్టినా తమకు చూపించలేదని, అసలు పసికందుకు వైద్యం చేయలేదంటూ ఆస్పత్రి బయట ఆందోళనకు దిగారు.