నిధులు మంజూరైనా నిర్మాణంలో నిర్లక్ష్యం
Published Fri, Jul 29 2016 11:49 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మండలంలోని వివిధ గ్రామాలకు రవాణా సౌకర్యాలు సరిగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా వర్షాకాలంలో పనుల నిమిత్తం ఇంటి నుంచి పక్క గ్రామాలకు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు.
మండలంలోని నర్సాపూర్ వాగుపై బ్రిడ్జిని నిర్మించి పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు అప్పటిప్రభుత్వం మూడేళ్ల క్రితం రూ. 5 కోట్ల నిధులు మంజూరు చేసింది. అయితే అధికారుల నిర్లక్ష్యంతో బ్రిడ్జి నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుండడంతో నర్సాపూర్‌తో పాటు బీరెల్లి గ్రామస్తులు ఏటా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల బ్రిడ్జి నిర్మా ణం చేపట్టేందుకు ఓ కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకుని ముందుకు వచ్చిన ప్పటికీ వర్షాలు కురుస్తుండడంతో పనులు ప్రారం భించలేదని స్థానికులు తెలిపారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అవతలి గ్రామాల్లోని పాఠశాలకు ఉపాధ్యాయులు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
ఏటా ఇబ్బందులే
– చింత సాంబయ్య, గ్రామస్తుడు, గోనెపల్లి
జంపన్నవాగు ఉధృతంగా ప్రవహించినప్పుడు ప్రతీ ఏటా వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం. వర్షాలు బాగా కురిసినప్పుడు గోనెపల్లి వాగు పొంగుతోంది. ఈ సమయంలో నిత్యావసర సరుకులు, వ్యవసాయ ఎరువులు, వైద్య సేవల కోసం అవస్థలు పడుతున్నం. పదేళ్ల క్రితం వాగు వరద దాటుతూ గ్రామానికి చెందిన ఒకరు నీటిలో మునిగి చనిపోయారు. వాగు ఉధృతి తగ్గే వరకు బయటి ప్రపంచాన్ని చూడలేకపోతున్నాం. అధికారులు తక్షణమే గోనెపల్లి వాగుపై బ్రిడ్జి నిర్మించి మమ్మల్ని ఆదుకోవాలి.
అధికారుల అలసత్వంతోనే తిప్పలు
– ఈసం సమ్మయ్య, గ్రామస్తుడు, ఎల్లాపూర్
నర్సాపూర్ వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వర్షాకాలంలో వాగు ఉప్పొంగుతుండడంతో అత్యవసర వైద్య సేవలకు ఇబ్బందులు పడుతున్నాం. తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యం కోసం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మం జిల్లా పినపాక మండలానికి వెళ్తున్నాం. వర్షాలు తగ్గిన వెంటనే బ్రిడ్జి నిర్మించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
Advertisement
Advertisement