ఎంతంత దూరం..
ఎంతంత దూరం..
Published Tue, Aug 16 2016 7:31 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM
యాత్రికుల తికమక
బస్సుల కోసం కిలో మీటర్ల దూరం నడక
సక్రమంగా రూటు చెప్పని పోలీసులు
సాక్షి, అమరావతి :
కృష్ణా పుష్కరాల యాత్రికులు అడుగడుగునా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రయాణానికి సంబంధించిన వివరాలు అందించడంలో విఫలమవుతున్నారు. పుణ్యం కోసం పుష్కరాలకు వస్తే పోలీసుల ఆంక్షలతో కిలో మీటర్ల కొద్ది దూరం నడవాల్సి వస్తోంది.
బస్సు కోసం నడవాల్సిందే..
50 అడుగుల దూరం వెళ్లితే గమ్యం చేర్చే బస్సులను ఎక్కాల్సి ఉన్నా స్థానిక పోలీసుల తికమక సమా«ధానం, ఆంక్షలతో రెండు కిలో మీటర్లు నడవాల్సి వస్తోంది. మంగళవారం పున్నమి ఘాట్, భవానీఘాట్లలో భక్తుల అవస్థలు పడ్డారు. భవానీ ఘాట్‌లో స్నానం చేసి దుర్గమ్మ గుడికి లే దా మరో చోటకీ వెళ్లాలంటే స్వాతి సెంటర్‌లో బస్సు ఎక్కాలి , కానీ అక్కడ వెళ్లి తాము వెళ్లాల్సిన బస్సు అడ్రస్ అడిగితే పోలీసులు పున్నమి ఘాట్ జంక్షన్‌లోకి వెళ్లి ఎక్కాలని సమాధానం ఇస్తున్నారు. కానీ అక్కడ వెళ్లాలంటే పోలీసుల ఆంక్షలు వల్ల రెండు కిలో మీటర్లు నడుచుకుంటూ జంక్షన్‌కు వెళ్లినా అక్కడ కూడా సరైన సమాధానం రావటం లేదు. బస్సుల అడ్రస్ తెలియక సామాన్య భక్తులు తికమక పడి అవస్థలు పడుతున్నారు. భవానీ ఘాట్ నుంచి పున్నమి ఘాట్‌కు వెళ్లాలంటే 50 అడుగుల దూరం ఉన్నా ట్రాఫిక్ మళ్లించడంతో సొరంగమార్గం గుండా రెండు కిలో మీటర్ల వరకు భక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు. దీంతో యాత్రికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Advertisement