పురోహితులంటే అంత చులకనా!
పురోహితులంటే అంత చులకనా!
Published Sat, Aug 20 2016 9:46 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM
ప్రతి విషయానికీ చికాకు పడుతున్న పోలీసులు
పిండాలను నదిలో కలపకుండా అడ్డగింత
గోదావరి పుష్కరాలకంటే దయనీయం
సాక్షి, విజయవాడ :
పుష్కరాలకు భారీగా ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెబుతున్నా... పిండప్రదానం చేసే భక్తులు, పురోహితులు నానా అవస్థలు పడుతున్నారు. పోలీసుల నుంచి చీదరింపులు, చీత్కారాలు ఎదురవుతున్నాయని పురోహితులు ఆరోపిస్తున్నారు. గత ఏడాది గోదావరి పుష్కరాల్లో పనిచేశామని, అక్కడ కూడా ఇంతగా వేధింపులు లేవని పేర్కొంటున్నారు.
పురోహితుల ఆరోపణలు ఇవీ..
ఒకవైపు పిండ ప్రదానం పూజ జరుగుతూనే ఉండంగా శుభ్రత పేరుతో పారిశుధ్య సిబ్బంది నీరు వదులుతున్నారని, దీంతో వారి దుస్తులు తడిసిపోతున్నాయి. తడిదుస్తులతోనే మధ్యాహ్నం వరకూ కూర్చోవాల్సి వస్తోంది.
– పావుగంట కంటే ఎక్కువ సేపు పూజ చేయిస్తుంటే త్వరగా ముగించాలంటూ డ్యూటీలో ఉన్న పోలీసులు హుకుం జారీ చేస్తున్నారని, అదేమని ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తిస్తున్నారు.
– ఎక్కువ మంది పురోహితులు ఒకే ఘాట్‌లో కనిపిస్తే బయటకు వెళ్లాలంటూ వేధిస్తున్నారు. పద్మావతి, కృష్ణవేణి ఘాట్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. సంగమం వద్దకు వెళ్లమని పోలీసులు సూచిస్తున్నారు.
– పిండాలను పట్టుకుని నది వద్దకు రావడంలోనే వలంటీర్లు అడ్డుకుని ఘాట్ చివరకు వెళ్లి వేయాలంటూ ఆక్షలు పెడుతున్నారు.
Advertisement