నాయకుడు చేసేదే రాజకీయం అనుకునే రోజులు పోయూరుు. ప్రజలు తలచుకుంటే నేతలను మించిన రాజకీయం చేయగలరని మరోసారి రుజు వైంది.
సాక్షి, ఏలూరు: నాయకుడు చేసేదే రాజకీయం అనుకునే రోజులు పోయూరుు. ప్రజలు తలచుకుంటే నేతలను మించిన రాజకీ యం చేయగలరని మరోసారి రుజు వైంది. ఓటును నోటుతో కొనేస్తే సరిపోతుందని కట్టల్ని తెచ్చి కుమ్మరించిన వ్యక్తులకు మునిసిపల్ ఎన్నికల్లో ఓటర్లు షాక్ ఇచ్చారు. ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా తాము ముందుగా నిర్ణయిం చుకున్న నాయకుడినే గెలిపించుకుంటామని చాటారు.
మునిసిపల్ పోలింగ్ సరళి తెలుగు తమ్ముళ్ల అంచనాలను తలకిందులు చేసింది.జనం నాడి పట్టుకోవడం ఎంతకష్టమో తెలిసొచ్చేలా చేసింది. దీంతో పరిషత్ ఎన్నికలపై తమ్ముళ్లు మరింత శ్రద్ధ పెంచారు. ఆషామాషీగా తీసుకుంటే గెలుపు అసాధ్యమని గ్రహించి తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
ధీమా ఏమైంది?
జిల్లాలో మొన్నటి వరకూ నడిచిన రాజకీ యం వేరు. మునిసిపల్ పోలింగ్ ముగిసి న తర్వాత రాజకీయం వేరుగా కనిపిస్తోంది. అభ్యర్థులు ఎవరికి వారే గెలుపు తమదేననుకున్నారు. ధీమాగా కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. చివరకు ఓటరు తీరుతో చతికిలపడ్డారు. గెలిచేది తామేనని గొప్పలు చెప్పుకున్న వారితోపాటు పరిషత్ ఎన్నికల బరిలో ఉన్నవారికి సైతం ఇప్పుడు ఓటమి భయం పట్టుకుంది.
ఓటరును ప్రసన్నం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదని తెలుసుకున్న రాజకీయ పార్టీలు సామాజిక సమీకరణలను తెరపైకి తెస్తున్నారుు. ఈసారి తమ వర్గం అభ్యర్థిని గెలిపించుకోకుంటే తర్వాత అవకాశం రాదని ఆ వర్గం పెద్దలకు చెబుతున్నారు. తద్వారా ఆ సామాజిక వర్గం ఓట్లను సాధించాలని చూస్తున్నారు. కుదేలైన కాంగ్రెస్‌లో నేటికీ ఖాళీగా ఉన్న వారిని, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఏ పార్టీలోనూ ఆశ్రయం దొరకని వారిని తమ పార్టీలో చేర్చుకుని ఆ సామాజిక వర్గం ఓట్లు రాబట్టాలని తమ్ముళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. మునిసిపల్ ఎన్నికల ముందూ ఇలాగే చేసినా ఫలితం దక్కలేదు. అరుునా సామాజిక తంత్రంపైనే ఆశలు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు.
దూసుకుపోతున్న వైసీపీ
గోబెల్స్ ప్రచారంతో కుప్పిగంతులు వేసిన పచ్చ చొక్కాలు ఒక్క సారిగా సెలైంట్ అయిపోయాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం పరిషత్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారుు. మునిసిపల్ ఎన్నికల్లో ఓటర్లు ఫ్యాన్ వైపే మొగ్గు చూపడం, సర్వే సంస్థలు వైసీపీదే విజయమని వెల్లడించడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పరిషత్ ఎన్నికల్లోనూ ప్రజలు విశ్వసనీయతకే పట్టం గడతారనే ధైర్యంతో ఆ పార్టీ నేతలు ప్రజల్లోకి వెళుతున్నారు.