
కేసీఆర్.. శాశ్వత సీఎంను అనుకోవద్దు!
బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తానే శాశ్వత సీఎంగా ఉంటానని అనుకుంటే ప్రజలు ఆయనకు తగిన గుణపాఠం చెబుతారని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు. గతంలో తామే శాశ్వతం అని భావించిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ సీఎం ఎన్టీరామారావులను ప్రజలు ఎన్నికల్లో ఓడించిన విషయాన్ని గుర్తుచేశారు. రాజకీయ లబ్ధికోసం కేసీఆర్, టీఆర్‌ఎస్ నేతలు అబద్ధాలు ఆడడం మానేయాలని అన్నారు. సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వమే అధికారిక ఉత్సవంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.