పాలమూరు, న్యూస్‌లైన్: మొన్నటిదా కాజిల్లాలో ముసురువర్షాలు కురిశాయి. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపో యి వాతావరణ చల్లబడి చలి తీవ్రరూ పం దాల్చింది. ఐదురోజులుగా జిల్లా ను చ లి పులి చంపేస్తోంది. సాయంత్రం నా లుగు గంటల నుంచే చల్లగాలు లు వీ స్తున్నాయి. మంచు ప్రభావంతో ఉద యం 9 గంటల వరకు కూడా సూ ర్యర శ్మి సోకకపోవడంతో ప్రజలు గజగ జ వణికిపోతున్నారు. ఈ క్రమంలో బుధవారం జిల్లాలో 16.2 డిగ్రీల కనిష్ట ఉ ష్ణోగ్రత నమోదైంది. గతేడాది నవంబ ర్‌లో ఉష్ణోగ్రతలు కొంత నిలకడగా ఉ న్నప్పటికీ ఇటీవల వచ్చిన పై-లీన్ తు ఫాన్, అల్పపీడనం కారణంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయినట్లు తెలుస్తోంది.
తగ్గిన పగటి ఉష్ణోగత్రలు
జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. ఈనెల 10తేదీన గరిష్ట ఉష్ణోగ్రత 30.4 డిగ్రీలు నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 18.1 డిగ్రీలుగా నమోదైంది. 11న గరిష్టంగా 31.4. కనిష్టంగా 16.0 డిగ్రీలు నమోదైంది. 12న గరిష్టం 30.4, కనిష్టం 15.1 కాగా 13న గరిష్టం 30.4, కనిష్ట ఉష్ణోగ్రత 16.2 డిగ్రీలుగా నమోదయింది. వచ్చే 24 గంటల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ఉదయం, సాయంత్రం వేళల్లో చలితీవ్రత మరింత పెరిగింది. స్వెట్టర్, మఫ్లర్, జర్కిన్ ఇతర జాగ్రత్తలు తీసుకోనిదే బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
నల్లమలను కప్పేసిన మంచుదుప్పటి
నల్లమలను మంచుదుప్పటి కప్పేసింది. ఉదయం 9 గంటలకు వరకు కూడా మంచుతెరలు తొలగిపోవడం లేదు. మైదాన ప్రాంతాల్లో కంటే ఇక్కడ తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ప్రాంతంలో అధికవర్షం ఎక్కువగా నమోదుకావడంతో పాటు చలి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎముకలు కొరికే చలిలో చెంచు గిరిజనులు రాత్రి వేళల్లో ఇబ్బందులు పడుతున్నారు. నల్లమలలోని కండ్లకుంట, గీచుగండి, ఫర్హాబాద్, మల్లాపూర్, పుల్లాయిపల్లి, ఆగర్లపెంట, రాంపూర్, అప్పాపూర్, బౌరాపూర్, మేడిమల్కల, ఈర్లపెంట, సంగడిగుండాలు, తాటిగుండాలు, పందిబొర్రె, ఎర్రపెంట తదితర చెంచుపెంటల గిరిజనులు అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లలేకపోతున్నారు. ఇక్కడ మధ్యాహ్నం 3 గంటల నుంచే చల్లటిగాలులు వీస్తున్నాయి. చలి నుంచి ఉపశమనం పొందేందుకు చెంచులు నిప్పుల నెగడి వద్ద కాచుకుంటున్నారు.
చలి పులి
Published Thu, Nov 14 2013 4:45 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM
Advertisement
Advertisement