పంక్షన్‌ తెచ్చిన తంటా.. గ్రామాల మధ్య ఘర్షణ | Clash Between Two Villages In East Godavari | Sakshi
Sakshi News home page

రెండు గ్రామాల మధ్య ఘర్షణ.. 144 సెక్షన్‌

Published Sun, May 6 2018 7:14 PM | Last Updated on Sat, Sep 1 2018 5:08 PM

Clash Between Two Villages In East Godavari - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి : మూడు రోజుల క్రితం ఓ ఫంక్షన్‌లో తలెత్తిన వివాదంతో మొదలైన ఘర్షణ నేటికి కొనసాగుతుంది. దీంతో జిల్లాలోని తొర్రేడు, వెంకటనగరం గ్రామాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివరాలివి.. తొర్రేడు గ్రామానికి చెందిన యువకులు ఆదివారం వెంకటనగరం వెళ్లడంతో గొడవ మళ్లీ మొదలైంది. అనంతరం ఇరు గ్రామాల ప్రజలు పరస్పరం కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ గొడవలో  గ్రామస్తులతో పాటు వారిని చెదరగొట్టడానికి వచ్చిన పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రెండు గ్రామాల ప్రజలను చెదరగొట్టారు. అంతేకాక పోలీసులు ఇరు గ్రామాల ప్రజల మధ్య సయోధ్య కుదిర్చారు. దీంతో వెంకటనగరం గ్రామంలో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement