ప్రజల తీవ్ర ఇబ్బందులు
కెన్యా : గత కొద్ది నెలలుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కెన్యా ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. వరదల వల్ల ఇప్పటి వరకు దాదాపు 215 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. 2లక్షల మంది ఇళ్లను కోల్పోగా దాదాపు 20 వేల మూగజీవాలు ప్రాణాలు విడిచినట్లు వారు తెలిపారు. మృతులలో ఎక్కువ మంది పసిపిల్లలు ఉండటం హృదయాలను కదిలించింది.
గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. తాజాగా నైరోబిలోని ఓ డ్యాం పగలడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాగా మరి కొన్ని డ్యాంలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయని తమను సురక్షితమైన ప్రాంతానికి తరలించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment