రాజుపాళెం: మండలంలోని రాజుపాళెం, కొర్రపాడు గ్రామాల్లో ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుల్లో (ఏపీజీబీ) బుధ, గురు, శుక్ర వారాల్లో నోక్యాష్ అని బోర్డులు పెట్టారు. దీంతో ఉదయాన్నే డబ్బులు తీసుకునేందుకు వచ్చిన రైతులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నోక్యాష్ అని బ్యాంకు అధికారులు బోర్డు పెట్టడంతో ఆందోళన చెందారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే డబ్బులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు.