లండన్ : సోషల్ మీడియాలో పాజిటివ్ ఇమేజ్ కోసం ఎంత డబ్బునైనా వెచ్చించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తాజా అధ్యయనంలో తేలింది. స్వీడన్‌కు చెందిన లండ్ యూనివర్సిటీకి చెందిన ఆర్థికవేత్తలు ముందుగా పలువురు వ్యక్తులను రెండు గ్రూపులుగా విభజించారు. అనంతరం, ఒక గ్రూపు వారిని సెల్ఫీలు తీసుకోవాలని కోరారు. తర్వాత రెండుగ్రూపుల వారిని సహకార పద్ధతిలో అజ్ఞాతవ్యక్తితో పరిశోధన నిర్వహించి, ఫలితాలను విశ్లేషించారు. అజ్ఞాతవ్యక్తితో వారు పంచుకున్న పలు విషయాలను ఆన్‌లైన్‌లో పబ్లిష్ చేయకుండా ఉండేందుకు ఎంత ఖర్చునైనా భరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా సెల్ఫీలు తీసుకున్న గ్రూప్ వారిలో ఇదీ ఎక్కువగా కనిపించిందని వర్సిటీకి చెందిన ఆర్థికవేత్త హోమ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment