positive attitude
-
సానుకూల దృక్పథం
అంతా మన మంచికే అనే మంత్రిగారి కథ అందరికీ తెలిసినదే. ‘‘అంతా మన మంచికే’’ అనే మంత్రిగారు రాజుగారి చిటికెనవేలు తెగితే కూడా అదే మాట అని చెరసాల ΄ాలు అయ్యారు. వేటకి వెళ్ళిన రాజుని ఆటవిక జాతివారు తమ దేవతకు బలి ఇవ్వబోయారు. చిటికెనవేలు లేక΄ోవటంతో అంగవైకల్యం ఉన్న వ్యక్తి బలికి పనికి రాడు అని వదిలి పెట్టారు. రాజు తిరిగి వచ్చి మంత్రిని విడుదల చేసి, ‘‘నాకు మీ రన్నట్టు మంచే జరిగింది, మీకు ఏం మంచి జరిగింది?’’ అని అడిగాడు. అందుకు మంత్రి ‘‘అది కూడా నా మంచికే జరిగింది. చెరసాలలో లేక΄ోతే తప్పకుండా మీతో వేటకి వచ్చే వాడిని. అంగవైకల్యం ఉన్న మిమ్మల్ని వదిలేసి అప్పుడు ఏ అవయవ లోపమూ లేని నన్ను బలి ఇచ్చేవారు’’ అని చె΄్పాడు. ఇది అతి మామూలు కథ. కానీ, దేనినైనా సానుకూల దృక్పథంతో ఎట్లా చూడాలి, దాని వల్ల ప్రయోజనం ఏమిటి? అన్న విషయాలు అర్థం అవుతాయి. కొన్ని ఆ క్షణాన ఇబ్బంది కలిగించేవిగా, అయిష్టంగా అనిపించ వచ్చు. కానీ, మనకి ఏది మంచో మనకన్నా ప్రకృతికే బాగా తెలుసు. ఆ ప్రకృతినే విశ్వం అని, దైవం అని, ఎనర్జీ అని రక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. వేసవి కాలంలో ఎటువంటి పళ్ళు, కూరలు ఆరోగ్యానికి మంచివో వాటినే ఇస్తుంది ప్రకృతి. వర్షాకాలంలో మామిడిపళ్ళు తినాలి అనిపించినా దొరకవు. ఎందుకో తెలుసా? ఆ వాతావరణానికి మామిడిపండు తినటం ఆరోగ్యానికి మంచిది కాదు. దొరికితే మామిడిపండు తినకుండా ఉండలేం. మన మంచికోసం దొరక కుండా చేసింది ప్రకృతి. ఈ దృక్పథం అలవాటయిన వారికి జీవితం కష్టాలమయంగా కనిపించదు. దేనినైనా తేలికగా తీసుకొని ముందుకి సాగటం ఉంటుంది. అట్లా అయితే వారి జీవితాల్లో కష్టాలు ఉండవా? ఉంటాయి, కానీ కన్నీళ్ళు ఉండవు. కష్టపడకుండా ఏదీ లభించదు. అది భౌతికమైనది. దాన్ని ఏదోవిధంగా దాటవచ్చు. మనస్సుకి ఎక్కించుకుంటే వేదన మిగులుతుంది.ఆ కాస్త ఇబ్బందిని అయినా ఎందుకు భరించాలి? అనే సందేహం వస్తుంది. కానీ మనం ఆ పరిస్థితిని మార్చలేము కదా! అప్పుడు కూడా అంతా మన మంచికే అనుకుంటే అద్భుతం జరుగుతుంది. దీని వల్ల మంచే జరుగుతుంది అనే సానుకూల భావన వల్ల మన మనసు సానుకూల భావతరంగాలను ప్రసరింప చేస్తుంది. భావతరంగాలు పరిసరాలని, పరిస్థితులని, వ్యక్తులని కూడా ప్రభావితం చేస్తాయి. దానివల్ల ముందుగా వాతావరణం, తరువాత మనస్సు ప్రశాంత మవుతాయి. పరిస్థితులు చక్కబడతాయి. దానికి కారణం నెమ్మదించిన మనస్సు. ఆధ్యాత్మిక గ్రంథాలు మాత్రమే కాదు, ఎఖార్ట్ వంటి ఆధునిక మనస్తత్వశాస్త్రవేత్తలు కూడా ఆలోచనని అనుసరించే పరిస్థితులు ఉంటాయి అని ప్రయోగాత్మకంగా నిరూపించారు. వేలికి దెబ్బ తగిలింది అని బాధపడటం కన్న చెయ్యి, కాలూ బాగున్నందుకు సంతోషించటం నేర్చుకోవాలి. సరైన చెప్పులు లేవని ఏడుస్తున్న కొడుకుకి కాళ్ళు లేని వాడిని చూపించాడుట తండ్రి. అప్పుడు లోటు ఉన్నా బాధ పడటం ఉండదు. సంతోషమే ఉంటుంది. సంతోషంగా ఉంటే ‘హాపీ హార్మోనులు’ విడుదల అవుతాయి. సంతోషం, ఆనందం బాహ్యమైన వస్తువులు, పరిస్థితుల పైన కాక దృక్పథం మీద ఆధార పడి ఉంటాయి. పురుటి నొప్పులు పడనిదే శిశువు లోకంలో అడుగు పెట్టటం కుదరదు. బిడ్డ చిరునవ్వు చూడగానే నొప్పుల సంగతి మరపుకి వస్తుంది. సాన పెట్టనిదే వజ్రం మెరవదు. నమలనిదే పదార్థం రుచి తెలియదు. గంధపుచెక్కని అరగదీయనిదే మంచిగంధం రాదు. చివరికి కుంకుడుకాయ రసం కావాలి అన్నా గట్టిగా పిసకాలి. ఇతర పళ్ల రసం గురించి చెప్ప నక్కర లేదు. గట్టిగా పిండనిదే రసం రాదు. ఈ కష్టం మెఱుగుదల కోసమే అని అర్థం చేసుకుంటే సమస్య లేదు. దానిని కూడా వ్యాయామం మొదలైనవి చేసినప్పుడు ΄÷ందే సుఖం లాగా ఆనందించవచ్చు. – డా. ఎన్. అనంత లక్ష్మి -
నైపుణ్యాలను పెంచుకుంటాం
న్యూఢిల్లీ: కెరీర్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకునేందుకు మన దేశంలో ఎక్కువ మంది నిపుణులు సానుకూల దృక్పథంతో ఉన్నారు. ఎడ్టెక్ ప్లాట్‌ఫామ్ ‘గ్రేట్ లెర్నింగ్’ ఈ మేరకు ఒక అధ్యయనం నిర్వహించి నివేదికను విడుదల చేసింది. అంతర్జాతీయంగా చూస్తే నైపుణ్యాల పెంపు విషయంలో భారత్‌లోనే ఎక్కువ మంది సానుకూల ధోరణితో ఉన్నారు. అలాగే, తమ ఉద్యోగాలను కాపాడుకోగలమని భారత్‌లో 71% మంది నిపుణులు చెప్పగా, అంతర్జాతీయంగా ఇలా చెప్పిన వారు 59 శాతంగానే ఉన్నారు. అంటే భారత్‌లోనే ఎక్కువ మంది ఉద్యోగ భద్రత విషయంలో నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తోంది. నైపుణ్యాల పెంపు, ఈ దిశగా వారిని ప్రేరేపించే అంశాలు, నైపుణ్యాలను పెంచుకోకుండా అడ్డుపడే అంశాలు, కార్యాలయాలు తిరిగి తెరవడం వల్ల నైపుణ్యాల పెంపుపై ప్రభావం గురించి గ్రేట్ లెర్నింగ్ సంస్థ తన నివేదికలో వివరాలు వెల్లడించింది. సర్వే అంశాలు.. ► మన దేశంలో 85 శాతం మంది నిపుణులు అదనపు నైపుణ్యాలు సంపాదించడం ద్వారా తమ కెరీర్లో భవిష్యత్తు అవసరాలకు సన్నద్ధంగా ఉండాలని అనుకుంటున్నట్టు చెప్పారు. కానీ, అంతర్జాతీయంగా చూస్తే 76 శాతం మంది ఈ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ► ఆగ్నేయాసియా దేశాల నుంచి 84 శాతం మంది, ల్యాటిన్ అమెరికా నుంచి 76 శాతం మంది నిపుణులు అదనపు నైపుణ్యాల ప్రాముఖ్యాన్ని తెలియజేశారు. ► అభివృద్ధి చెందిన అమెరికాలో తమ కెరీర్ భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు నైపుణ్యాలను సముపార్జించుకుంటామని కేవలం 64 శాతం మంది చెప్పగా, మధ్య ప్రాచ్యం నుంచి 66 శాతం మంది ఈ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ► 2023లోనే తాము నైపుణ్యాలను పెంచుకుంటామని 83 శాతం మంది భారతీయులు చెప్పగా, అంతర్జాతీయంగా 74 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని తెలియజేశారు. ► 71 శాతం మంది భారతీయ నిపుణులు తమ ఉద్యోగాలను నిలుపుకుంటామని చెప్పగా, అంతర్జాతీయంగా 59 శాతం మంది ఈ విధమైన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ► మన దేశంలో 71 శాతం మంది నిపుణులు ప్రస్తుత ఉద్యోగాల్లో కొనసాగుతామని చెప్పారు. అంతర్జాతీయంగా ఇలా చెప్పిన వారు 59 శాతంగా ఉన్నారు. ► అమెరికాలో 59 శాతం మంది నిపుణులు ఉద్యోగ భద్రతను ప్రదర్శించారు. ఆగ్నేయాసియాలో ఇది 60 శాతంగా ఉంది. నేర్చుకోవడానికి సిద్ధం మెజారిటీ ఉద్యోగుల మనోగతం పియర్సన్ స్కిల్ అవుట్‌లుక్ సర్వేలో వెల్లడి తమ కెరీర్ అవసరాలకు అనుగుణంగా ఉండేందుకు తాము కెరీర్ అంతటా నేర్చుకునేందుకు, శిక్షణ తీసుకునేందుకు సుముఖంగా ఉన్నా మని 88% మంది ఉద్యోగులు తెలిపారు. కొత్త భాషను, ముఖ్యంగా ఇంగ్లిష్ నేర్చుకోవడం వల్ల తమ కెరీర్లో పురోగతికి తోడ్పడుతుందని వారు భావిస్తున్నారు. పియర్సన్ స్కిల్ అవుట్‌లుక్ సర్వే లో ఈ విషయాలు తెలిశాయి. అమెరికా, బ్రిటన్, భారత్, బ్రెజిల్లో 4,000 మంది ఉద్యోగుల అభిప్రాయాల ఆధారంగా సర్వే వివరాలు విడుదలయ్యాయి. ► ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా ఉండేందుకు నేర్చుకోవడాన్ని కొనసాగిస్తామని ప్రతి 10 మందిలో 9 మంది చెప్పారు. ► కంపెనీలు తమకు నైపుణ్య శిక్షణను ఆఫర్ చేస్తాయని 75 శాతం మంది చెప్పారు. ► మన దేశంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా ప్రాసెసింగ్, కోడింగ్ భవిష్యత్తు ప్రాధాన్య నైపుణ్యాలుగా ఉన్నాయి. ► భవిష్యత్ మానవ నైపుణ్యాలుగా భాషను జెనరేషన్ జెడ్ గ్రూపులోని వారు (1990– 2010 మధ్య జన్మించిన) చూస్తున్నారు. ► జెనరేషన్ ఎక్స్‌లోని వారు తమ కెరీర్ వృద్ధి పట్ల సానుకూల దృక్పథంతోఉన్నారు. ► గత మూడేళ్లలో ఎదురైన అనిశ్చితుల నేపథ్యంలో తమ కెరీర్‌పై పునరాలోచన చేస్తున్నట్టు 88 శాతం జెనరేషన్ జెడ్ వారు చెప్పారు. -
రష్యాపై ఎందుకీ తటస్థ వైఖరి?
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ఏకాభిప్రాయాన్ని నిర్మించే ప్రయత్నాలు నిలిచిపోయాయి. ఒకప్పుడు ఉక్రెయిన్ అనుకూల వైఖరిని తీసుకున్న దేశాలు కూడా రష్యాకు అనుకూలంగానో, తటస్థంగానో మారిపోయాయి. ప్రచ్ఛన్న యుద్ధకాలంలోని అలీనోద్యమం నుంచి ప్రస్తుత జాగరూకత, తటస్థ వైఖరి ప్రభావితమయ్యాయి. తమ నిబంధనల మేరకు వ్యవహరించడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ అలీనోద్యమం ఒక మార్గం కల్పించింది. నిర్దిష్ట ఆర్థిక, రాజకీయ ప్రోత్సాహకాలు కూడా ఇందులో ప్రభావం చూపుతున్నాయి. అయితే, అలీన దేశాలకు మానవతా సాయం అందించాలన్న పాశ్చాత్య దేశాల నిబంధనల వెలుగులో ఈ తటస్థత అనేది ఒక ‘గమ్మత్తయిన సంతులన చర్య’గా మారుతోంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఏడాది దాటిన తర్వాత, రష్యాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ఏకాభిప్రాయాన్ని నిర్మించే ప్రయత్నాలు నిలిచిపోయినట్లు కనిపిస్తోంది. చాలాదేశాలు తటస్థతను ఎంచుకోవడమే దీనికి కారణం. కొన్ని ఆధారాల ప్రకారం, రష్యాను ఖండిస్తున్న దేశాల సంఖ్య కూడా ప్రస్తుతం తగ్గిపోయింది. ఉక్రెయిన్ అనుకూల వైఖరి నుండి బోట్స్ వానా రష్యా పైవు మళ్లింది. దక్షిణాఫ్రికా, తటస్థత నుంచి రష్యా అనుకూల వైఖరి చూపుతోంది. రష్యా చర్యను ఖండించిన కొలంబియా ఇప్పుడు తటస్థ వైఖరి అవలంబిస్తోంది. అదే సమయంలో, చాలా దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడానికి అయిష్టత చూపుతున్నాయి. ఆఫ్రికాను తీసుకుందాం. మాస్కో తక్షణం కాల్పుల విరమణ ప్రకటించాలని ఆఫ్రికన్ యూనియన్ పిలుపునిస్తున్నప్పటికీ, అనేక ఆఫ్రికా ఖండ దేశాలు తటస్థంగానే ఉంటున్నాయి. ఇది ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి వామపక్ష అనుకూల ప్రభుత్వాల సంప్రదాయ ఫలితమేనని కొందరు పరిశీలకులు వాదిస్తు న్నారు. ఆఫ్రికా దేశాల అయిష్టతకు మూలం తమ అంతర్గత వ్యవహారాల్లో కొన్నిసార్లు రహస్యంగా, కొన్నిసార్లు బహిరంగంగా పాశ్చాత్య దేశాలు పాటించిన జోక్యందారీ చరిత్రలో ఉందని మరికొందరు చెబుతున్నారు. రష్యాను ఖండించడానికి అయిష్టత చూపడం అనేది ఆఫ్రికాను దాటిపోయింది. రష్యా బేషరతుగా, తక్షణం ఉక్రెయిన్ నుంచి వెళ్లి పోవాలంటూ ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానాన్ని 2023 ఫిబ్రవరిలో లాటిన్ అమెరికన్ దేశాల్లో చాలావరకు బలపర్చాయి. ఉక్రెయిన్‌కి అనుకూలంగా ఐక్యరాజ్యసమితి చేసిన పలు తీర్మానాలను బ్రెజిల్ బలపర్చినప్పటికీ, అది రష్యాను నిర్ద్వంద్వంగా ఖండించలేదు. ఐక్యరాజ్య సమితిలో బొలీవియా, క్యూబా, ఎల్ సాల్వడార్, వెనిజులా దేశాల వైఖరిని చూద్దాం. పాశ్చాత్య దేశాల ఆంక్షలను రష్యా తిప్పి కొట్టాలని అవి సూచించాయి. పైగా, బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ దేశాలు ఉక్రెయిన్ కు సైనిక సహాయం చేయాలన్న పిలుపును తిరస్కరించాయి. ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు అందించాలని జర్మనీ తీసుకున్న నిర్ణయాన్ని మెక్సికో ప్రశ్నించింది. ఆసియాలోనూ ఇదే రకమైన విభజనలు కనిపిస్తున్నాయి. జపాన్, దక్షిణ కొరియా బహిరంగంగానే రష్యాను ఖండించాయి. కానీ ఆగ్నే యాసియా దేశాల కూటమి సామూహికంగా ఈ ఖండన చేయలేదు. ఇక చైనా విషయానికొస్తే – రష్యాతో వ్యూహాత్మక భాగస్వామ్యం నెరుపుతూనే, ఐక్యరాజ్యసమితిలో పెరుగుతున్న తన ప్రాభవం ద్వారా సమతుల్యత సాధించేలా వ్యవహరిస్తోంది. భారత్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యదేశంగా ఉన్నప్పుడు, ఉక్రెయిన్ ఘర్షణపై జరిగిన ఓటింగుకు గైర్హాజరైంది. ప్రచ్ఛన్న యుద్ధకాలంలోని అలీనోద్యమం నుంచి ప్రస్తుత జాగరూకత, తటస్థ వైఖరి ప్రభావితమయ్యాయి. తమ నిబంధనల మేరకు ఘర్షణతో పోరాడటానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అలీనోద్యమం ఒక మార్గం కల్పించింది. అందువల్ల సోవియట్ యూనియన్, పాశ్చాత్య దేశాల ప్రభావ పరిధికి వెలుపల విదేశీ విధానంలో స్వయంప్రతిపత్తిని ఈ దేశాలు పొందగలిగాయి. యూరోపియన్ యూనియన్ వైఖరిని బలపర్చడంలో ఇతర దేశాల అయిష్టత అనేది విదేశీ విధాన స్వతంత్ర కాక్షకూ, పొరుగు దేశంతో విరోధం పెట్టుకోవడానికి అయిష్టతకూ సంబంధించినదిగా ఉంటోందని యూరోపియన్ యూనియన్ ఆంక్షల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పశ్చిమ దేశాలకూ, రష్యాకూ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల్లో చిక్కుకుపోకుండా ఉండటానికి అలీన విధానం ఆయా దేశాలకు ఉపకరిస్తోంది. ఈ కారణం వల్లే, అనేక ప్రజాస్వామిక దేశాలు తటస్థ వైఖరికి ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రాంపోసా ‘ఇరుపక్షాలతో మాట్లాడండి’ అనడంలో దీన్నే మనం చూడవచ్చు. రష్యాను ఖండించ డానికి వ్యతిరేకంగా ఉండాలని దేశాలు నిర్ణయించుకోవడంలో నిర్దిష్ట ఆర్థిక, రాజకీయ ప్రోత్సాహకాలు ప్రభావం చూపుతున్నాయి. ఇండియాకు పెరిగిన రష్యా చమురు ప్రచ్ఛన్న యుద్ధానంతర కాలంలో రష్యా, భారత్ ఒకే విధమైన వ్యూహాత్మక, రాజకీయ అభిప్రాయాలను పంచుకోవడం కొనసాగించాయని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. 2000 సంవత్సరంలో తమ వ్యూహాత్మక భాగస్వామ్యం నేపథ్యంలో బహుళ ధ్రువ గ్లోబల్ వ్యవస్థను నిర్మించాలన్నది రష్యా ఉద్దేశంగా ఉండింది. అమెరికాను భాగస్వామిగా చేసుకోవడం పట్ల జాగ్రత్తగా ఉండాలని భారతదేశాన్ని రష్యా అభ్యర్థించేది. అలాగే భారతీయ అణ్వాయుధ కార్యక్రమానికి రష్యా మద్దతునిచ్చింది, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా మారడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలను రష్యా బలపరుస్తూ వచ్చింది. భారత్ ఆయుధ వాణిజ్యంలో రష్యా కీలక భాగస్వామిగా ఉండ టాన్ని రష్యా కొనసాగించింది. 1992 నుంచి 2021 వరకు భారత్ దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో 65 శాతం వరకు రష్యా సరఫరా చేసింది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటినుంచి, భారత్‌కు చౌక ధరకు చమురు అందించే కీలకమైన సరఫరాదారుగా రష్యా మారి పోయింది. 2021లో రష్యా నుంచి రోజుకు 50 వేల బ్యారెల్స్‌ను భారత్ కొనుగోలు చేయగా, 2022 జూన్ నాటికి అది రోజుకు పది లక్షల బ్యారెల్స్‌కు పెరిగింది. బ్రెజిల్, దక్షిణాఫ్రికా ప్రయోజనాలు ప్రపంచంలోనే అత్యంత పెద్ద వ్యవసాయ ఉత్పత్తిదారుల్లో ఒక్కటిగా ఉన్న బ్రెజిల్ అత్యధిక ఎరువుల వినియోగదారు కూడా. 2021లో రష్యా నుంచి బ్రెజిల్ దిగుమతి చేసుకున్న దిగుమతుల విలువ 5.58 బిలియన్ డాలర్లు కాగా, వాటిలో 64 శాతం వాటా ఎరు వులదే. తమ రెండు దేశాల మధ్య ఇంధన సంబంధాలను విస్తరించుకోవడంలో భాగంగా రష్యా గ్యాస్ సంస్థ గాజ్ప్రోమ్ బ్రెజిల్ ఇంధన రంగంలో పెట్టుబడులు పెడుతుందని 2023 ఫిబ్రవరిలో బ్రెజిల్ ప్రక టించింది. 2023 మార్చి నాటికి బ్రెజిల్‌కు రష్యా డీజిల్ ఎగుమతులు కొత్త రికార్డులను చేరుకున్నాయి. అదే సమయంలో రష్యన్ చమురు ఉత్పత్తులపై ఈయూ ఆంక్షలు కూడా పతాక స్థాయిని చేరుకున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై సంవత్సరం పూర్తయిన సంద ర్భంలో– రష్యా, చైనాలతో కలిసి దక్షిణాఫ్రికా సంయుక్త నౌకా విన్యా సాలను చేపట్టింది. నౌకాదళ నిధుల లేమితో ఉన్న దక్షిణాఫ్రికా ఈ విన్యాసాల నుంచి ప్రయోజనం పొందుతుంది. ఆఫ్రికా ఖండానికి అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా రష్యా నిలుస్తోంది. అణుశక్తిని కూడా రష్యా సరఫరా చేస్తోంది. ఆఫ్రికా ఖండానికి 30 శాతం వరకు గోధుమ వంటి ధాన్యాలను కూడా రష్యా సరఫరా చేస్తోంది. రష్యా ఉత్పత్తుల్లో 70 శాతం వరకు ఆఫ్రికా ఖండానికి చేరుతున్నాయి. మరొక ప్రజాస్వామిక వ్యవస్థ సమస్యల్లో చిక్కుకున్నప్పుడు మద్దతుగా నిలబడాలని అభ్యర్థనలు చేస్తున్నప్పటికీ, అలీన విధానం ఇప్పటికీ పాపులర్ ఎంపికగా కొనసాగుతోందని ఉక్రెయిన్ యుద్ధం ఎత్తి చూపింది. భారత్ వంటి దేశాలకు ముఖ్యమైన రాజకీయ ఉనికిగా అలీన విధానం చాలాకాలంగా కొనసాగుతూ వస్తోంది. ఇతర ఉదంతాలను చూస్తే, అధ్యక్షుడు జైర్ బొల్సొనారో హయాంలో ఇది మారినప్పటికీ, ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే బ్రెజిల్ వంటి దేశాల సంప్రదాయ విధానంగా కొనసాగుతోంది. ప్రత్యేకించి అలీన దేశాల్లో చాలావాటికి ప్రత్యక్ష మదుపులు, అభివృద్ధి, మానవతా సహాయాన్ని అందించడం అనే పాశ్చాత్య నిబంధనల వెలుగులో చూస్తే ఇది విరుద్ధ ప్రయోజనాల ఘర్షణకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో తటస్థత అనేది ఒక ‘గమ్మత్తయిన సంతులన చర్య’గా మారుతోంది. జోస్ కబల్లెరో వ్యాసకర్త సీనియర్ ఆర్థికవేత్త (‘ద కాన్వర్సేషన్’ సౌజన్యంతో) -
ఫ్రెషర్ల నియమాకాలపై కంపెనీల్లో సానుకూలత
ముంబై: ఫ్రెషర్లకు ఉపాధి కల్పించే విషయంలో కంపెనీల్లో సానుకూల ధోరణి 61 శాతానికి పెరిగింది. టెక్నాలజీ, డిజిటల్ సేవలకు డిమాండ్‌తో సంస్థలు మరింత మంది ఫ్రెషర్లను తీసుకోవాలని అనుకుంటున్నట్టు టీమ్‌లీజ్ ఎడ్యుటెక్ కెరీర్ అవుట్‌లుక్ నివేదిక తెలిపింది. దీంతో ఫ్రెషర్లకు ఉపాధి అవకాశాలు గతేడాది జూన్–డిసెంబర్ కాలంతో పోలిస్తే ఈ ఏడాది ఇదే కాలానికి మూడు రెట్లు అధికంగా ఉంటాయని పేర్కొంది. ఈ ఏడాది ద్వితీయ భాగం ఆరంభంలో నిపుణులను ఆకర్షించడం ప్రముఖ కంపెనీలు, వ్యాపారవేత్తలకు ప్రాధాన్య అంశంగా మారినట్టు తెలిపింది. 865 చిన్న, మధ్య, పెద్ద స్థాయి కంపెనీలపై టీమ్‌లీజ్ ఈ సర్వే నిర్వహించింది. ఐటీ 34 శాతం, ఈ కామర్స్ అండ్ టెక్నాలజీ స్టార్టప్‌లు 23 శాతం, టెలీ కమ్యూనికేషన్స్ 22 శాతం, ఇంజనీరింగ్ రంగం 20 శాతం మేర గతేడాది ఇదే కాలంతో పోలిస్తే మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఈ ఏడాది ద్వీతీయ ఆరు నెలల కాలంలో ఫ్రెషర్లకు ఉపాధి అవకాశాల పరంగా.. బెంగళూరు 25 శాతం, ముంబై 19 శాతం, ఢిల్లీ 18 శాతం వృద్ధిని చూపించనునన్నట్టు అంచనా వేసింది. -
పేరెంటింగ్: భయం కాదు... భరోసా పెరగాలి
ఆదివారం పిల్లలను తీసుకుని పార్కుకు వెళ్లారు సంగీత దంపతులు. లోపలికి అడుగుపెట్టగానే పార్కులో ఎత్తైన గోడ అడ్వెంచర్వాల్ మీదనే పడింది పిల్లల దృష్టి. పోటీ పడి పరుగందుకున్నారిద్దరూ. ఎవరు ముందు గోడ దగ్గరకు వెళ్తారో అనేది ఒక పోటీ. ఎవరు ముందు గోడ ఎక్కుతారోననేది మరో పోటీ. వాళ్ల పరుగును అందుకోలేక, పరుగెత్తి వెళ్లకుండా ఉండలేక ఆయాసపడుతున్నారు తల్లిదండ్రులు. గోడ ఎక్కే ప్రయత్నంలో పిల్లలు కింద పడతారేమోననే భయం. వారి ఆందోళనను ఆపుకోలేక వెనుక నుంచి ‘పడిపోతారు, జాగ్రత్త’ అని పిల్లలకు వినిపించేటట్లు పెద్దగా అరుస్తున్నారు. ఈ ఆందోళననే వద్దంటున్నారు చైల్డ్ సైకాలజిస్టులు. పిల్లలకు చెప్పాల్సింది ‘పడిపోతారు, జాగ్రత్త’ అని కాదు. ‘జాగ్రత్తగా ఎక్కండి, కింద మేమున్నాం’ అని భరోసానివ్వాలంటున్నారు. పిల్లలకు నీళ్లు కనిపిస్తే ఉత్సాహం ఉరకలు వేస్తుంది. చెట్టు కనిపిస్తే చిటారు కొమ్మకు వేళ్లాడే వరకు మనసు ఊరుకోదు. అనుక్షణం పిల్లలను ఓ కంట కాచుకుంటూ ఉండడం మంచిదే, కానీ అడుగడుగునా వాళ్ల ఉత్సాహానికి అడ్డుకట్ట వేయడం మాత్రం మంచిదికాదు. పిల్లలకు భయం తెలియదు, పెద్దవాళ్లు తమ భయాన్ని పిల్లల మెదళ్లలోకి రవాణా చేస్తారు. ఇది పిల్లల మెదళ్లలో ఇంకిపోతుంది. ఫలితంగా తమ మీద తమకు నమ్మకం నశిస్తుంది. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఇదే గుర్తు పిల్లల మాటల్ని జాగ్రత్తగా వినాలంటారు సైకాలజిస్ట్ సుదర్శిని. ‘అమ్మా ఆ చెట్టు పై కొమ్మ మీదకు వెళ్తే ఎలా ఉంటుంది, ఆ గోడ వెనుక ఏముంటుంది’ అని వాళ్ల నోటి వెంట వచ్చిందీ అంటే... అంతకంటే ముందు ఆ ఆలోచన వాళ్ల మెదడులో పుట్టిందనే కదా అర్థం. చెట్టు పై కొమ్మ మీదకు వెళ్తే జరిగే ప్రమాదాన్ని వివరించాలి. చెట్టు మీద ఎంతవరకు వెళ్లడం క్షేమకరమో చెప్పి, వాళ్లను చెట్టు ఎక్కమని, ‘నీ భద్రత కోసం కింద మేముంటాం’ అని చెప్పాలి. చెట్టు ఎక్కడం నేర్పించడమే కరెక్ట్. అంతే తప్ప, పిల్లలకు తమ కళ్లతో ప్రపంచాన్ని చూపిస్తూ, తమ కాళ్లతో నడిపిస్తూ పెంచడం సరైన పెంపకం కాదంటారామె. పిల్లలు తమ ప్రయత్నంతో కిందపడిపోతే చేయి అందించి లేపడమే బెస్ట్ పేరెంటింగ్. పడకుండా పెంచాలనుకోకూడదు. పిల్లలు తమ తొలి ప్రయత్నంలో సక్సెస్ కాకపోతే మరో ప్రయత్నం చేయడానికి ప్రోత్సహించాలి. అంతేకానీ ‘నీ వల్ల కాదులే, ఇక మానుకో’ అని నిరుత్సాహపరచకూడదు. ఏ తీరున పెంచుతున్నాం? ‘‘ఒక తరంలో... యాభై ఏళ్ల కిందట దాదాపుగా అన్ని ఇళ్లలోనూ అథారిటేరియన్ పేరెంటింగ్ ఉండేది. ఒకరకంగా అది నియంతృత్వమే. ‘మేము తల్లిదండ్రులం. మేము నిర్ణయిస్తాం. పిల్లలు అనుసరించి తీరాల్సిందే. అదే క్రమశిక్షణ’ అనుకునేవాళ్లు. పాతికేళ్ల కిందట పరిస్థితి పూర్తిగా పెర్మిసివ్గా మారిపోయింది. అంటే... పిల్లలు దేనికీ నొచ్చుకోకూడదన్నట్లు వాళ్లు అడిగీ అడగక ముందే అన్నీ అమర్చడం. అవసరం ఉన్నాలేకపోయినా అడిగినవన్నీ కొనిచ్చి మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. ముఖ్యంగా గడచిన తరంలో ఆర్థిక ఇబ్బందులును ఎదుర్కొన్న వాళ్లు ఈ తరంలో తమ పిల్లలకు అవసరానికి మించి అన్నీ సమకూర్చేయడం, తమకు దక్కని సంతోషాలన్నీ పిల్లలకు మిక్కిలిగా అందాలని తాపత్రయపడడం ఎక్కువగా కనిపిస్తోంది. నిజానికి ఇది మంచి ఫలితాలనివ్వదు. అలాగే నెగ్లెక్ట్ఫుల్ పేరెంటింగ్ అనేది ఫలానా రోజుల్లో అని కాదు, అప్పుడూ ఇప్పుడూ కూడా కనిపిస్తోంది. పిల్లల్ని గాలికి వదిలినట్లే ఉంటుంది తల్లిదండ్రుల తీరు. ఇది ఏ మాత్రం స్వాగతించలేని పేరెంటింగ్ అన్నమాట. ఇక అందరూ అంగీకరించి తీరాల్సిన పేరెంటింగ్ స్టైల్స్‌లో ఒకటి ‘అథారిటేటివ్ పేరెంటింగ్’ మాత్రమే. ఇందులో తల్లిదండ్రులు నిర్ణయాధికారులుగా ఉండరు. పేరెంట్స్– పిల్లలు సమానమే. ఇరువురూ ఒకరి అభిప్రాయాలను మరొకరు వినాలి. పరస్పరం చర్చించుకుని, మంచిచెడులు విశ్లేషించుకుని తుది నిర్ణయం మీద ఒక అంగీకారానికి రావాలని చెప్తుంది ఈ థియరీ. పిల్లలకు కొన్ని పరిమితమైన లిమిట్స్‌లో ఫ్రీడమ్ ఉంటుంది. అలాగే పెద్దవాళ్లకూ బాధ్యతల పరిధులతో కూడిన పేరెంటింగ్ ఇది. ఇక పిల్లల్లో ఉన్న బెస్ట్ క్వాలిటీస్‌ని గుర్తించి అందులో శిక్షణ ఇప్పించి, కరెక్ట్‌గా చానలైజ్ చేసి పిల్లలను తీర్చిదిద్దడం అత్యున్నతమైన పేరెంటింగ్. దీనినే ‘పాజిటివ్ పేరెంటింగ్’ అంటారు. అథారిటేటివ్, పాజిటివ్ పేరెంటింగ్లు రెండూ అనుసరించాల్సిన పద్ధతులే అని, పిల్లల పెంపకంలో అవలంబించాల్సిన పద్దతిని వివరించారు సైకాలజిస్ట్. ఇది ఓ కళ పిల్లల్ని పెంచడం అనేది అద్భుతమైన కళ. మళ్లీ మళ్లీ ప్రాక్టీస్ చేసి నైపుణ్యం సాధించవచ్చు అనే అవకాశం ఇందులో ఉండదు. ఉన్నది ఒక్కటే జీవితం అన్నట్లు... తల్లిదండ్రుల చేతిలో ఉన్నది ఒక్కటే అవకాశం. విజయవంతమైనా, విఫలమైనా అది ఆ ఒక ప్రయత్నంలోనే. అందుకే అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మన భయాలు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని సన్నగిల్లేలా చేయకూడదు. ప్రోత్సాహం ద్వారా వారి మీద వాళ్లకు నమ్మకం కలిగించాలి. సెల్ఫ్ ట్రస్ట్ కోల్పోయే విధంగా భద్రంగా పెంచినట్లయితే... వాళ్లు భవిష్యత్తులో ఎప్పుడూ ఎవరో ఒకరి ఆధారాన్ని వెతుక్కుంటూ ఉంటారు. గోడ ఎక్కడంలో జారిపడితే, పడకుండా ఎక్కగలిగే వరకు మాత్రమే వెంట ఉండి ధైర్యం చెప్పాలి. అలాగే ‘చెట్టు ఎక్కాల్సింది నువ్వే, నువ్వు నేర్చుకునే వరకు నీకు సహాయంగా ఉంటాను’ అనే భరోసాను మాత్రమే తల్లిదండ్రులు ఇవ్వాల్సింది. ‘పడిపోతావు కాబట్టి చెట్టు ఎక్కవద్దు’ అని భయపెట్టడం మానాల్సిందే. ఇందులో మరోమాటకు తావులేదు. డాక్టర్ సుదర్శని సబ్బెళ్ళ క్లినికల్ సైకాలజిస్ట్, జి జి హెచ్, కాకినాడ – వాకా మంజులారెడ్డి -
ఎదుటివారిని ఎంత ప్రేమిస్తున్నారో చెప్పేయండి: అనుష్క
Anushka Shetty: ‘‘అందరితో ప్రేమగా ఉండండి. ఎదుటివారిని ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పండి. వాళ్ల గురించి ఏమనుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి. అతిగా స్పందిస్తున్నారని బాధపడకండి. ఎక్కువగా ప్రేమను చూపించండి ప్రపంచంలో ఇంకా మంచితనం ఉందని నిరూపించండి’’ అంటున్నారు అనుష్క. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. దాని సారాంశం ఏంటంటే... ‘‘అన్నింటిలోనూ మంచినీ, అందాన్నీ వెతకండి. ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించండి. అంతేకానీ జరిగినదాన్ని తలుచుకుంటూ బాధపడకండి. కొత్త ఆరంభాలను స్వాగతించండి. ఎప్పుడూ హాయిగా నవ్వండి. ఎక్కువగా ఆశలు పెట్టుకోండి. ఎక్కువగా బతికేందుకు ప్రయత్నించండి. మీతో మీరు ఎక్కువగా గడపండి. మీ బాధలను పోగొట్టేవారితో ఉండండి. మీరింకా బతికే ఉన్నారని గుర్తు చేసే అంశాలను దృష్టిలో ఉంచుకుని మీరెంత అదృష్టవంతులో ఊహించుకోండి. జీవితం ఎంత బాగుందో గుర్తు చేసుకోండి. ప్రపంచంలో అందమైనవన్నీ మాయమైపోతున్నాయి. మీ హృదయం కూడా అందులో ఓ భాగం కాకుండా చూసు కోండి’’ అన్నారు అనుష్క. -
ఇలా ఉంటే గుండె బేఫికర్..
న్యూయార్క్ : జీవితంలో సానుకూల అంశాలపై దృష్టిసారిస్తూ సంతృప్తికరంగా జీవించేవారిలో గుండెపోటు, స్ట్రోక్ ముప్పు 35 శాతం తక్కువని తాజా అథ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 2,30,000 మంది డేటాను, 15 అథ్యయనాలను పరిశీలించిన అనంతరం పరిశోధకులు ఈ విషయం తేల్చారు. సానుకూల దృక్పథంతో కూడిన వారిలో అకాల మరణం ముప్పు 14 శాతం తక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. సానుకూల ఆలోచనలు కలిగిన వారు శారీరక వ్యాయామానికి, మెరుగై ఆహారానికి ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్యం కాపాడుకుంటారని పరిశోధకులు భావిస్తున్నారు. గుండెపై ఒత్తిడి పెంచి శరీరంలో వాపునకు కారణమయ్యే ఒత్తిడి, ఆందోళనలను ఎలా అధిగమించాలో కూడా వారికి తెలుసునని ఈ అథ్యయనం తెలిపింది. సానుకూల ఆలోచనలు రేకెత్తించే పరిణామాలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని న్యూయార్క్‌కు చెందిన మౌంట్ సినాయ్ సెయింట్ ల్యూక్స్ హాస్పిటల్ బృందం పేర్కొంది. సానుకూల దృక్పథంతో కూడిన మైండ్‌సెట్‌తో కార్డియోవాస్క్యులర్ ముప్పు తగ్గుతుందని తమ పరిశోధనలో వెల్లడైందని అథ్యయన రచయిత ప్రొఫెసర్ అలన్ రోజన్స్కీ చెప్పుకొచ్చారు. ఒత్తిడి, కుంగుబాటు, ఒంటరితనం గుండె జబ్బులకు దారితీస్తాయని ఆయన పేర్కొన్నారు. సానుకూల ధోరణితో హైబీపీ, కొవ్వుశాతం వంటి రిస్క్ కారకాలు అదుపులో ఉంటాయని ఫలితంగా గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందని తెలిపారు. -
పాజిటివ్ ఇమేజ్ కోసం ఎంతైనా!
లండన్ : సోషల్ మీడియాలో పాజిటివ్ ఇమేజ్ కోసం ఎంత డబ్బునైనా వెచ్చించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తాజా అధ్యయనంలో తేలింది. స్వీడన్‌కు చెందిన లండ్ యూనివర్సిటీకి చెందిన ఆర్థికవేత్తలు ముందుగా పలువురు వ్యక్తులను రెండు గ్రూపులుగా విభజించారు. అనంతరం, ఒక గ్రూపు వారిని సెల్ఫీలు తీసుకోవాలని కోరారు. తర్వాత రెండుగ్రూపుల వారిని సహకార పద్ధతిలో అజ్ఞాతవ్యక్తితో పరిశోధన నిర్వహించి, ఫలితాలను విశ్లేషించారు. అజ్ఞాతవ్యక్తితో వారు పంచుకున్న పలు విషయాలను ఆన్లైన్లో పబ్లిష్ చేయకుండా ఉండేందుకు ఎంత ఖర్చునైనా భరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా సెల్ఫీలు తీసుకున్న గ్రూప్ వారిలో ఇదీ ఎక్కువగా కనిపించిందని వర్సిటీకి చెందిన ఆర్థికవేత్త హోమ్ తెలిపారు. -
అంతా మన మంచికే!
వైద్యులు ఏది చెప్పినా మన మంచికే. కాకపోతే వారు వైద్యశాస్త్రం చదివి ఉంటారు. శాస్త్రం ఎప్పుడైనా నిష్కర్షగా, కర్కశంగా చెబుతుందన్న విషయం పింగళివారు మాయాబజారు ద్వారా ఎప్పుడో చెప్పించారు. దాన్ని మనం సౌమ్యంగా, సున్నితంగా స్వీకరించాలని కూడా తన పాత్రల ద్వారా బోధించారు. కాబట్టి డాక్టర్ల మాటా, ఫీజూ, వారితో వ్యవహారం మనకు కాస్త నిష్కర్షగా, కర్కశంగా అనిపించవచ్చు. కానీ మనం దాన్ని పాజిటివ్ దృక్పథంతో మెత్తగా, మృదువుగా తీసుకోవాలి. అయితే బాగా చదువుకున్న వారికి కించిత్ పండిత గర్వం ఉంటుంది. పండితులైన వారికీ సరస్వతీ కటాక్షం నిండుగా ఉంటుంది. దాంతో లక్ష్మీదేవి కటాక్షం నిండుకొని ఉంటుంది. అత్తాకోడళ్లకెప్పుడూ పడదు కాబట్టి ఆటోమేటిగ్గా లక్ష్మీదేవికీ, పండితులవారికి బొత్తిగా సరిపడకుండా ఉంటుంది. అలాంటి బాగా చదువుకున్న ఒకాయనకు ఒకసారి జబ్బు చేసి వైద్యుడి దగ్గరికి వెళ్లాడు. సదరు వైద్యజ్ఞులు మన పండితులవారి దగ్గర డాక్టరు కన్సల్టేషను కోసమని, టెస్టుల కోసమనీ విపరీతంగా ధనం గుంజి ఉంటారు. అసలే కవి, దానికి తోడు కన్సల్టేషనిత్యాది ఖర్చులతో ఎగస్ట్రాగా మంట. దాంతో సహజంగానే సంస్కృత పండితులైన మన కవిగారికి విపరీతమైన కోపం వచ్చింది. అంతే... ఫీజులవీ తడిసి మోపెడైనందుకు చిర్రెత్తుకొచ్చింది. దాంతో వావీవరసా మరచిపోయారు. ‘వైద్యో నారాయణో హరిః’ అని కదా నానుడి. వైద్యుడి నారాయణుడంతటి వాడన్న విషయాన్ని తనకు గల మంట వల్ల వక్రీకరించి కవిత్వంలో అందునా సంస్కృతంలో శాపనార్థాలు పెట్టారు. వైద్యరాజ నమస్తుభ్యం / యమరాజ సహోదర యమన్తు హరతి ప్రాణాన్ / వైద్యః ప్రాణాన్ ధనానిచ! అనగా ‘యముడికి సోదరుడైన ఓ వైద్య రాజా నీకు నమస్కారం. యముడి కంటే నువ్వే గొప్ప. ఎందు కంటే... పాపం... యముడికి ప్రాణాలు తీయడం మాత్రమే వచ్చు. నీకు దాంతో పాటు జేబులో డబ్బులు తీయడం కూడా వచ్చు’ అంటూ ఆడిపోసుకున్నాడు. ఇంతలో తోటి పండితుడైన వారెవరైనా ‘యముడి సోదరుడు శని కదా?’ అని సందేహం లేవనెత్తగా... అవన్నీ ఆలోచించకుండానే కవిత్వం చెప్పానంటావా? శనిదేవుడిలాగే వైద్యభగవానుడూ తగులుకుంటే ఓ పట్టాన వదలడు అందుకే కవిత్వంలో నా ఎక్స్ప్రెషన్ ఎగ్జాక్ట్లీ సరైనదే అంటూ సర్టిఫికెట్ కూడా ఇచ్చుకున్నాడు. కానీ... సదరు పండితుల వారిలా మనం డాక్టర్ల చర్యలను తప్పుపట్టకూడదు. పాజిటివ్ దృష్టితో చూడాలి. వారేం చేసినా మన కోసమే, మన మంచి కోసమే చేస్తారు. ఉదాహరణకు మనకు మటనూ, చికెనూ ఇష్టమనుకోండి. వారు అవేవీ తినవద్దంటారు. మటను కిలో రూ. 500 పైమాటే. అదే కూరగాయలనుకోండి... రోజుకు రూ.20 ఖర్చు చేసినా 25 రోజులు గడిచిపోతాయి. అంటే ఒక్క రోజు విలాసంగా ఖర్చు చేసే బదులు అదే సొమ్ముతో దాదాపు నెల రోజుల కూరల సమకూరేలా చూస్తున్నారు. ఒకవేళ మనకు జబ్బు చే సిందనుకోండి... ఆ కిలో మాంసం డబ్బును ఆయనకు కన్సల్టేషన్గా కట్టడానికి సౌకర్యంగా ఉంటుంది. అలాగే మనకు మోటారు సైకిలూ, కారూ గట్రా ఉన్నా నడక ప్రాక్టీసు చేయమంటారు. ఎందుకంటే... రేపు పొరబాటునో, గ్రహపాటునో మనకు ఏ ఆపరేషనో జరిగిందనుకోండి... మన కారునో, బైకునో అమ్మేసి, ఆ సొమ్మును సర్జరీకి కట్టేస్తాం. ఈ లోపు నడక బాగా అలవాటైపోయిందనుకోండి... ఇక హాయిగా, శ్రమలేకుండా నడవచ్చు. సొమ్ముకోసం కారూ, బైకూ అమ్ముకున్నామన్న దిగులుండదు. పెట్రోలు ధర పెరిగిందన్న బాధ ఉండదు. ఇక ఎంత నడిస్తే అంత ఆరోగ్యం ఎగస్ట్రా లాభం. ఇలా వారేం చెప్పినా ఆ మాటల వెనక సొంతలాభం కన్నా, ఒక మహితోక్తీ, మతలబూ ఉంటాయని గ్రహించాలి. పింగళి వారు చెప్పినట్లుగా శాస్త్రం తాలుకు కర్కశత్వం వెనక తర్కమేమిటో సంగ్రహించాలి. రసపట్టులో తర్కం కూడదేమోగానీ... జబ్బు కారణంగా వచ్చిన నీరసపట్టులో తర్కం సహేతుకమే. యాసీన్