విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తున్న సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి
కలెక్టరైనా నేతలవేపే
Published Thu, Sep 15 2016 9:30 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
– సీపీఎం జిల్లా కార్యదర్శి ఆరోపణ
– బదిలీ చేయాలని డిమాండ్
కర్నూలు సిటీ: ప్రజా సంక్షేమం కోసం పని చేయాల్సిన జిల్లా కలెక్టర్...కార్పొరేట్ కంపెనీలు, రాజకీయ నేతలకు అనుకూలంగా పని చేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. స్థానిక సుందరయ్య భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నానో కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అడ్డుపడకుండా ఉంటే గ్రామాల్లో రోడ్లు వేయిస్తాం, మురుగు కాల్వలు నిర్మిస్తామంటూ కంపెనీ యాజమానులకు అనుకూలంగా కలెక్టర్ మాట్లాడడాన్మిన బట్టి ఆయన యాజమాన్యంతో కుమ్మక్కయ్యారన్న అనుమానం వస్తోందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఏ ఒక్కరు వ్యతిరేకం కాదని, అయితే ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చే పరిశ్రమలు మాత్రం పెట్టవద్దన్నారు. దీనిపై రైతులు అడ్డుకుంటే కలెక్టర్ కేసులు పెట్టించడం ఎంటని ఆయన ప్రశ్నించారు. చట్టాన్ని చుట్టంలా చేసుకుని నిత్యం ఉద్యోగులను ఇబ్బంది పెడుతూ పైశాచికానందం పొందుతున్నారని కలెక్టర్‌పై అగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం వేలాది రోగులతో రద్దీగా ఉండే ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివద్ధిని పట్టించుకోవడం లేదన్నారు. అలాంటి కలెక్టర్.. రైతులతో మాట్లాడేందుకు వచ్చిన బివి.రాఘవులను శకునాలకు పోకుండా రాత్రికి రాత్రే అక్కడ 144 సెక్షన్ పెట్టడం సరికాదన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి.షడ్రక్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement