
హైదరాబాద్: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ‘పీపుల్స్ పల్స్’ చేపట్టిన సర్వే అంచనాలు.. ఫలితాలతో దాదాపు సరిపోలాయి. రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్‌కు పది రోజుల ముందే సర్వే పూర్తిచేశామని ఆ సంస్థ తెలిపింది. ఆ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. హిమాచల్‌లో బీజేపీకి 39–44 సీట్లు, కాంగ్రెస్‌కు 19–24 సీట్లు, ఇతరులకు 2–4 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. సోమవారం విడుదలైన హిమాచల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 44, కాంగ్రెస్ 21, ఇతరులు మూడు చోట్ల గెలుపొందారు. పీపుల్స్ పల్స్ సర్వేకు తగ్గట్లే సీపీఎం ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక, గుజరాత్‌లో పట్టణ ప్రాంతాల్లో బీజేపీ, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుందని సర్వే తేల్చింది. ఫలితాల్లోనూ ఇదే విషయం వెల్లడైంది. బీజేపీ 44.8శాతం, కాంగ్రెస్ 43.3శాతం ఓట్లు సాధిస్తాయని సర్వేలో తేలింది. ఫలితాల్లో బీజేపీకి 49.1శాతం, కాంగ్రెస్‌కు 42.4 శాతం ఓట్లు పోలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment