నిలిచి పోయిన రిజిస్ట్రేషన్లు | Pending registrations | Sakshi
Sakshi News home page

నిలిచి పోయిన రిజిస్ట్రేషన్లు

Published Wed, Aug 12 2015 1:04 AM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM

నిలిచి పోయిన రిజిస్ట్రేషన్లు

నిలిచి పోయిన రిజిస్ట్రేషన్లు

♦ బీఎస్‌ఎన్‌ఎల్ అధికారుల అలసత్వంతో ప్రజల అవస్థలు
♦ ప్రభుత్వ ఆదాయానికి  లక్షల్లో గండి
 
 గుంటూరు రూరల్ : ఓ పక్క రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగి ప్రజలు అవస్థలు పడుతుంటే మరో పక్క ఆన్‌లైన్ పనిచేయక మరిన్ని ఇంబ్బందులు పడుతున్నారు. రెండు రోజులుగా నల్లపాడు గ్రామం లో బీఎస్‌ఎన్‌ఎల్ సేవలకు అంతరాయం కలగటంతో రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రోడ్డు విస్తరణలో భాగంగా వైర్లు తెగి అన్‌లైన్ వ్యవస్థ పనిచేయకపోవటంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలంటున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ అధికారుల అలసత్వం వల్లే ఇబ్బందులు పడుతున్నామని ఆరోపిస్తున్నారు. రెండు రోజులుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవటంతో ప్రభుత్వ ఆదాయానికి లక్షల్లో గండిపడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement