ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్‌సీపీ నేతలపై తెలుగుదేశం పార్టీ నేతలు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు.
పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథిపై కేసు నమోదు
కంకిపాడు: ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్‌సీపీ నేతలపై తెలుగుదేశం పార్టీ నేతలు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. మత్స్యకారులకు అండగా నిలిచిన ఆ పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథిపై కంకిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మద్దూరు గ్రామంలో మత్స్యకారులు నిర్మించుకున్న అభయాంజనేయస్వామి దేవాలయం విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం ఉంది. దీనిపై వెఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె.పార్థసారథి మద్దూరు పంచాయతీ కార్యదర్శి సీహెచ్ కిరణ్‌ను ఫోన్‌లో ప్రశ్నిం చారు. ఆయన కంకిపాడు పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. పార్థసారథి తనతో ఫోన్‌లో దురుసుగా మాట్లాడారంటూ ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఒత్తిడి మేరకు శనివారం కేసు నమోదు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.