
కేసీఆర్ అసమర్థత వల్లే ఇబ్బందులు: షబ్బీర్
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ అసమర్థత, అనుభవరాహిత్యంతోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లయిన తర్వాత కూడా ఇంకా గత ప్రభుత్వాలదే బాధ్యత అనడం సిగ్గుచేటన్నారు. నాలాలపై ఆక్రమణలు కూల్చివేస్తామంటే ఎవరు అడ్డుకున్నారని, ఇలాంటి వాటికి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని అయ్యప్ప సొసైటీలో కేవలం రెండు బంగళాలను కూల్చివేసి ఎందుకు ఆపారని, ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో బోర్డును పెట్టి ఎందుకు తీసివేశారని ప్రశ్నించారు.