వైఎస్సార్‌జిల్లా: అకాల వర్షం రావడంతో వైఎస్సార్‌జిల్లా ఓబుల వారిపల్లి మండల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఆదివారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో పాటు కురిసిన వర్షానికి మండల పరిధిలోని పది గ్రామాల్లో 100 కు పైగా విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. 50 కి పైగా ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయియి. దీంతో మండలంలోని పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు.. రవాణ సౌకర్యాలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.