
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరులో గాలివాన బీభత్సవం సృష్టించింది. ఈదురుగాలులకు అనంతరాజుపేట వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ సమీపంలోని చిన్న చిన్న షాపుల పై కప్పు లేచిపోయాయి. ఈ రేకులు రోడ్డుపై పడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల చెట్లు కూడా రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. గాలివానకు షాపులు ధ్వంసం కావడంతో చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో చెట్లు విరిగిపడటంతో ద్విచక్రవాహనాలు దెబ్బతిన్నాయి. విశాఖపట్నంలో కూడా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సోమవారం సాయంత్రం నగరంలోని పలు చోట్ల వర్షం కురిసింది. తీవ్ర ఉక్కపోతతో బాధపడుతున్న నగరవాసులకు వర్షం కాసింత ఉపశమనం కలిగించిందని చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment