ప్రజాసమస్యలపై బీజేపీ పోరుబాట  | BJP Party Fights Against People Problems In Telangana | Sakshi
Sakshi News home page

ప్రజాసమస్యలపై బీజేపీ పోరుబాట 

Published Mon, Aug 31 2020 4:31 AM | Last Updated on Mon, Aug 31 2020 5:33 AM

BJP Party Fights Against People Problems In Telangana - Sakshi

బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని, ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనలు తెలపాలని, ఉద్యమాలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలంటూ వివిధ ఆందోళనా కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ అధ్యక్షతన ఆదివారం బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, పార్టీ చేపట్టాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబరు నెలాఖరు నాటికి రోజుకో కార్యక్రమం చొప్పున 18 కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.

నేటి నుంచి చేపట్టబోయే కార్యాచరణ 
► ఆగస్టు 31: వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కిసాన్‌ మోర్చా అధ్వర్యంలో వ్యవసాయ కమిషనర్‌కు వినతిపత్రం. ప్రైవేట్‌ టీచర్లు, కాలేజీ లెక్చరర్ల సమస్యలపై యువమోర్చా ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రికి వినతిపత్రం. 
► సెప్టెంబర్‌ 1: పార్టీ జిల్లా శాఖల ఆధ్వర్యంలో కరోనా నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు. 
► 2న: తెలంగాణ విమోచనం కోసం బలిదానమైన అమరవీరులకు పరకాలలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ శ్రద్ధాంజలి ఘటిస్తారు.  
► 3న: ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు వసూలు చేస్తున్న అధిక ఫీజులపై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వినతిపత్రం 
► 3, 4 తేదీల్లో: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్‌ 17న అధికారికంగా నిర్వహించాలని, తెలంగాణ విమోచన పోరాటాన్ని పాఠ్యాంశంగా చేయాలని, పోరాటం జరిగిన స్థలాలను స్మృతి కేంద్రాలుగా తీర్చిదిద్దాలని డిమాండ్‌ చేస్తూ తహసీల్దార్లకు వినతిపత్రాలు. 
► 4న: కరోనాను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన కార్యక్రమాలు  
► 5న: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు 
► 6న: తెలంగాణ విమోచన దినోత్సవంపై రాష్ట్రస్థాయిలో కళాకారుల సమావేశం నిర్వహణ. 
► 7న: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్‌కు విన్నవించడం 
► 8న: తెలంగాణ విమోచన దినోత్సవంపై రాష్ట్రస్థాయిలో మేధావులతో సమావేశం నిర్వహణ  
► 11న: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిరసన కార్యక్రమాలు 
► 12, 13 తేదీల్లో: కృష్ణా నదిపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల సందర్శన 
► 17న ఉదయం: ప్రతి పోలింగ్‌ బూత్‌లో జాతీయజెండా          ఎగురవేయాలి  
► 17న సాయంత్రం: తెలంగాణ విమోచన దినోత్సవంపై బహిరంగ ర్యాలీ (వర్చువల్‌ ర్యాలీ) 
► 21న: గోదావరి నది జలాలపై రాష్ట్ర స్థాయి రౌండ్‌ టేబుల్‌ సమావేశం 
► 25న: పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రతి పోలింగ్‌ బూత్‌లో కనీసం 10 మొక్కలు నాటాలి. 
► సెప్టెంబర్‌ చివరి నాటికి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చిన విధంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి రాష్ట్రంలో 100 రైతు ఉత్పత్తి సంఘాలు(ఎఫ్‌పీవో) ఏర్పాటు కోసం కార్యాచరణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement