TDP Chandrababu Says Not Contesting Atmakur By Election AP - Sakshi
Sakshi News home page

Atmakur By Election AP: ఆత్మకూరులో పోటిపై చంద్రబాబు క్లారిటీ

Published Fri, Jun 3 2022 12:06 PM | Last Updated on Fri, Jun 3 2022 3:58 PM

Tdp Chandrababu Says Not Contesting Atmakur By Election Ap - Sakshi

సాక్షి, అమరావతి: మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతి కారణంగా వచ్చిన ఆత్మకూరు ఉప ఎన్నికలో తాము పోటీ చేయడం లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రకటించారు. ఎక్కడైనా సిట్టింగ్‌ ఎమ్మెల్యే మృతి చెందితే.. అక్కడ తాము పోటీ పెట్టడం లేదన్నారు. మొదటి నుంచి టీడీపీ ఈ విధానాన్ని పాటిస్తోందని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో గురువారం చంద్రబాబు జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.

బాదుడే బాదుడు, సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీల ఏర్పాటు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకూరు ఎన్నికపై మాట్లాడారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులకే తిరిగి ఉప ఎన్నికలో సీటు ఇస్తే పోటీ పెట్టకూడదన్నారు. బద్వేలులో తాము ఎందుకు పోటీ చేయలేదో ఆత్మకూరులోనూ అందుకే చేయడం లేదన్నారు.

చదవండి: Divyavani On Chandrababu Naidu: టీడీపీలో మహిళలకు గౌరవం లేదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement