రుణమాఫీ లేదు.. ఏం లేదు.. | Mla in Athmakuru | Sakshi
Sakshi News home page

రుణమాఫీ లేదు.. ఏం లేదు..

Published Tue, Aug 16 2016 10:51 PM | Last Updated on Tue, Aug 14 2018 2:09 PM

రుణమాఫీ లేదు.. ఏం లేదు.. - Sakshi

రుణమాఫీ లేదు.. ఏం లేదు..

ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి వద్ద వాపోయిన మహిళలు
ఆత్మకూరురూరల్‌ : ‘చంద్రబాబు పొదుపు మహిళలకు రుణమాఫీ అంటూ ఊదరగొట్టి ఒక్కొక్కరి ఖాతాలో కేవలం రూ.3,000 జమచేసి ఆ సొమ్ము సైతం వాడుకునేందుకు వీల్లేకుండా కొర్రీలు పెట్టారని’ మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం మండలంలోని పాతజంగాలపల్లి గ్రామంలో గడపగడపకు వైఎస్సార్‌ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి సమస్యలు తెలుసుకున్నారు. ఎస్సీకాలనీలో బద్దెల లక్ష్మమ్మ తన ఐదు నెలల వయస్సు ఉన్న మనుమరాలికి గుండెలో చిల్లు ఉందని డాక్టర్లు చెప్పారని, ఆ పాపకు ఆరోగ్యశ్రీకార్డు లేదని ఆవేదన వ్యక్తంచేసింది. అధికారులతో మాట్లాడి సాయం చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. దేవరపాటి కొండయ్య అనే వ్యక్తి తనకు గతంలో పింఛన్‌ వస్తుండేదని, ప్రస్తుతం నిలిపేశారని చెప్పాడు. గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ బాబు అధికారంలోకి రావడం కోసం వెయ్యి అబద్దాలు ఆడారని విమర్శించారు. అర్హులైన వారికి పక్కాగహాలు నిర్మిస్తామని హామీ ఇచ్చి రెండేళ్లయినా ఒక్క ఇళ్లుయినా కట్టిన పాపానపోలేదన్నారు. రైతులవాణిని అసెంబ్లీలో వినిపిస్తానన్నారు. సర్పంచ్‌ గడ్డం విజయసేన, జి.శ్రీనివాసులురెడ్డి, మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ అల్లారెడ్డి ఆనందరెడ్డి, నాయకులు ఉల్సా పెంచలయ్య, సానా వేణుగోపాల్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, శ్రీరాములు, ముక్కమళ్ల రఘురామిరెడ్డి, వెంకటరెడ్డి, చిన్నపరెడ్డి, యానాదిరెడ్డి, ఖాజావలి, ఖాదర్‌బాష, షేక్‌ ఖాజావలి, పి.చంద్రశేఖర్‌రెడ్డి, జయరామిరెడ్డి, ఎండీ ముజీబ్, ఓబుల్‌రెడ్డి, రహీం, వశీం, బాదుల్లా తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement