ఆత్మకూరు(ఎం) : తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో కల్యాణలక్ష్మి పథకం కింద ఆర్థికసాయం పొందడానికి దరఖాస్తు చేసుకున్న మండలంలోని కూరెళ్ల గ్రామానికి చెందిన జింజిరాల రామచంద్రు–వరలక్ష్మిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పి.శివనాగప్రసాద్ బుధవారం విలేకరులకు తెలిపారు. గ్రామానికి చెందిన రామచంద్రు–వరలక్ష్మి ఫిబ్రవరి నెలలో కూతరు వివాహం కాగా ఏప్రిల్‌లో వివాహమైనట్టు వివాహ పత్రికను ముద్రించి కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఆర్‌ఐ డి.సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
కేసునమోదు
Published Thu, Sep 8 2016 2:49 AM | Last Updated on Tue, Oct 2 2018 4:01 PM
Advertisement
Advertisement