విద్యుదా ఘాతానికి గురై మహిళ మృతి | New Bride Died With Electric Shock In Hyderabad, Details Inside | Sakshi
Sakshi News home page

విద్యుదా ఘాతానికి గురై మహిళ మృతి

Published Mon, May 20 2024 7:14 AM | Last Updated on Mon, May 20 2024 9:07 AM

new bride died with Electric shock in Hyderabad

అడ్డగుట్ట: స్నానం చేయడానికి బాత్‌రూమ్‌లోకి వెళ్లిన నవ వధువు ప్రమాదవశాత్తు విద్యుత్‌ ఘాతానికి గురై మృతి చెందింది. ఈ ఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్‌ పరి«ధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ షాహీద్‌ పాషా తెలిపిన మేరకు.. లాలాపేటలోని ఆర్యనగర్‌ ప్రాంతానికి చెందిన  మౌనిక(26)కు నాచారం లోని చిలుకనగర్‌ ప్రాంతానికి చెందిన రమేష్‌ అనే వ్యక్తితో వివాహం జరిగింది. శనివారం మౌనిక తండ్రి తన  కూతురు, అల్లుడిని ఆర్యనగర్‌లోని తన ఇంటికి తీసుకొచ్చాడు. 

ఆల్లుడు రమేష్‌ రాత్రి వరకు ఉండి భోజనం చేసి వెళ్లిపోయాడు.   మరుసటి రోజు మధ్యాహ్నం  మౌనిక స్నానం చేసేందుకు బాత్‌రూమ్‌లోకి వెళ్లి బోర్‌కు  మోటర్‌ ఆన్‌ చేసింది. దీంతో విద్యుత్‌ ఘాతానికి గురై పెద్ద కేకలు వేసి పడిపోయింది. వెంటనే కుటుంబసభ్యులు బాత్‌రూమ్‌లోకి వెళ్లే ప్రయత్నం చేయగా వారికి కూడా షాక్‌ కొడుతుండడంతో వెంటనే మెయిన్‌ ఆఫ్‌ చేసి మౌనికను గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. 

కాగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బోర్‌ మోటర్‌కు సంబంధించిన వైర్లు తెగిపోయి ఉన్నాయని, సరిగా టేప్‌ కూడా వేయకపోవడంతో షార్ట్‌ సర్క్యూట్‌కు గురై ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement