నవ వధువు దారుణ హత్య | Assassination the new bride | Sakshi
Sakshi News home page

నవ వధువు దారుణ హత్య

Published Thu, Jun 19 2014 1:55 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

నవ వధువు దారుణ హత్య - Sakshi

నవ వధువు దారుణ హత్య

నందికొట్కూరురూరల్: నందికొట్కూరు పట్టణంలో ఓ నవ వధువు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురైన సంఘటన బుధవారం వెలుగు చూసింది. రాళ్లతో కొట్టి చంపి..ముఖంపై పెట్రోలు పోసి నిప్పంటించి అతి కిరాతకంగా హతమార్చారు. తెల్లవారుజామున పొలాలకు వెళ్లే కూలీలు మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతురాలు పట్టణానికి చెందిన శివమ్మ(18)గా నిర్ధారించారు. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం మేరకు.. పట్టణంలోని ఏబీఎం పాలెంకు చెందిన శ్రీను, లక్ష్మి దంపతుల కూతురు శివమ్మకు గత నెల 25న ఉండవెళ్లి గ్రామానికి చెందిన సురేష్‌తో వివాహం చేసి అత్తారింటికి పంపించారు. వారం రోజుల క్రితం తల్లిదండ్రులు కూతురు, అల్లుడిని పుట్టింటికి పిలుచుకొని వచ్చారు.
 
 అదివారం ఉదయం బహిర్భుమికి వెళ్లిన శివమ్మ తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లితండ్రులు బంధువుల ఇళ్లలో గాలించిన ఆచూకీ లభించకపోవడంతో అదే కాలనీకి చెందినదావీదుపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాహానికి ముందు శివమ్మ దావీదు అనే యువకుడ్ని ప్రేమించడంతో అతనికి తమ కూతురును ఇచ్చి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో దావీదు తమ కూతురును మాయమాటలు చెప్పి ఎక్కడికైన తీసుకెళ్లి ఉంటాడని వారు ఆరోపించారు.

మంగళవారం పోలీసులు ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తుండగానే బుధవారం శివమ్మ శవమై కనిపించింది. కూతురు విగతజీవిగా పడి ఉండటం చూసిన తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. తమ కూతురుకు దావీదు హత్య చేసి ఉంటాడని తల్లితండ్రులు ఆరోపించారు.
 
సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
పట్టణ శివారు పొలాల్లో వివాహిత మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన స్థలాన్ని డీఎస్పీ నరసింహారెడ్డి పరిశీలించారు. నిందితుడిని గుర్తించేందుకు ఆధారాలు సేకరిం చారు. శివమ్మ హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తులపై అనుమానం ఉందని డీఎస్పీ పేర్కొన్నారు.   నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement