ఫేస్‌బుక్ ప్రేమ ఎంత పనిచేసింది. ఎన్నో ఆశలతో ఆమెతో కొత్త జీవితం ప్రారంభిలానుకున్న వరుడికి పెళ్లైన కాసేపటికే గుండె బద్దలయ్యే నిజం తెలిసింది. వధువు అంత పనిచేస్తుందని అతను కలలో కూడా అనుకొని ఉండడు. ఇంతకీ ఏం జరిగిందంటే..?
వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాలు జిల్లాకు చెందిన అలోక్ కుమార్ మిస్త్రీకి ఒడిశాలోని పఢా జిల్లాకు చెందిన మేఘనతో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్తా 15 రోజులకే ప్రేమగా మారింది. దీంతో మే 24న జాజ్పుర్లోని ఛండీఖోల్లో మేఘనను అలోక్ కలిశాడు. ఈ క్రమంలోనే వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో, వీరి గురించి కుటుంబ సభ్యులకు చెప్పి వారిని ఒప్పించారు.
అనంతరం వీరిద్దరికీ అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరిగింది. కాగా, అదే రోజు సాయంత్రం వరుడి ఇంట్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఓ అతిథి వరుడికి పెద్ధ షాకిచ్చాడు. పెళ్లికూతురును మేఘన అని కాకుండా మేఘనాథ్ అని పిలిచాడు. దీంతో వరుడి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వధువు(అతని) పేరు మేఘన కాదు మేఘనాథ్ అని, అతను తమకు దగ్గరి బంధువే చెప్పాడు.
ఈ విషయం తెలుసుకున్న కుబుంబ సభ్యులు కంగుతిన్నారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన వరుడు.. అతడిని చితకబాదుడు. గ్రామస్తులు కూడా ఫేక్ వధువును పట్టుకుని కొట్టారు. అనంతరం అతను అబ్బాయి అని తెలిశాక పొడవాటి జుట్టును కత్తిరించారు. అనంతరం మేఘనాథ్‌పై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇలా పెళ్లి పెటాకులు కావడంతో వరుడి హృదయం ముక్కలైంది.
ఇది కూడా చదవండి: అందర్నీ ఆశ్చర్యపరిచేలా వధువు ఎంట్రీ!.. వరుడు షాక్
Comments
Please login to add a commentAdd a comment