మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. వీరిద్దరూ నిజంగా రిలేషన్‌లో లేరని, 'లస్ట్ స్టోరీస్ 2' ప్రచారం కోసం అలా చెప్పారని కూడా వార్తలు వచ్చాయి. అలాంటి ప్రచారాలకు చెక్ పెడుతూ తమన్నా, విజయ్ వర్మ ఇద్దరూ కూడా తమ రిలేషన్‌షిప్ గురించి ఓపెన్ అయ్యారు. తమన్నాతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు ఈ మధ్య విజయ్ బహిరంగంగానే చెప్పాడు. తామిద్దరూ డేటింగ్‌లో ఉన్నామని ఇప్పుడు తనకు బాగా అర్థమవుతోందన్నాడు.
ఆమెతో ఎంతో సంతోషంగా ఉన్నానంటూ.. తనను పిచ్చిగా ప్రేమిస్తున్నానని తెలిపాడు. ఆమె రాకతో తన జీవితంలో విలన్ దశ ముగిసిపోవడమే కాకుండా రొమాంటిక్ దశ మొదలైందని చెప్పాడు. తమన్నా భాటియాను పెళ్లి చేసుకోవాలని కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు వస్తున్న వార్తలపై విజయ్ వర్మ పలు విషయాలు వెల్లడించాడు.
మళ్లీ తాజాగా తన పెళ్లి గురించి ఇంట్లో ఎలాంటి ఒత్తిడి ఉందో విజయ్ ఇలా స్పందించాడు. ' నా జీవితంలో పెళ్లిపై ఒత్తిడి ఎప్పుడో ప్రారంభమైంది. నేను మార్వాడీని. మా కమ్యూనిటీలో, అబ్బాయిలు 16 ఏళ్లు రాగానే పెళ్లి చేసుకోగల వయస్సుగా పరిగణించబడతారు. కాబట్టి ఇవన్నీ ఎప్పుడో నా జీవితంలో ప్రారంభమయ్యాయి. కొన్నేళ్ల తర్వాత నా పెళ్లి గురించి ఆ ఒత్తిడి కొంచెం తగ్గింది.. ఎందుకంటే నేను పెళ్లి చేసుకునే వయస్సు ఎప్పుడో దాటిపోయింది. పైగా అప్పటికి నేను నటుడిని అయ్యాను. ఇదీ కూడా ఒక కారణం అని చెప్పవచ్చు.
(ఇదీ చదవండి: సినీ నటిపై రేప్.. ఇంటర్వ్యూ పేరుతో హోటల్‌కు తీసుకెళ్లి ఆపై..)
మా అమ్మ మాత్రం పదేపదే పెళ్లి ప్రస్తావన తెచ్చేది. కానీ నేనే మాత్రం కెరీర్ వైపు మాత్రమే దృష్టి పెట్టాను. ఇప్పటికీ కూడా ఆమ్మ ఫోన్ కాల్ వస్తే మొదట అడిగే ప్రశ్న పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు..? అనే ఉంటుంది. సినిమాల వల్ల బిజీగా ఉండటంతో కుదరలేదని ఇంతవరకు చెప్పే వాడిని ఇప్పుడా అవకాశం లేదు. అని చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: విజయ్‌సేతుపతితో మోస్ట్ కాంట్రవర్సీ హీరోయిన్ రొమాన్స్)
ఈ వ్యాఖ్యలతో తమన్నా-విజయ్ వర్మ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, ఎప్పటి నుంచో పెళ్లి గురించి ఒత్తిడి తెస్తున్న తన తల్లి కోసం అయినా సాధ్యమైనంత త్వరలో తమన్నాతో ఏడడుగులు వేయడం ఖాయమని సోషల్‌మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే పెళ్లికి విజయ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే. కానీ.. సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న తమన్నా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment