నటన కంటే, గ్లామర్ డాల్ గానే ముద్ర వేసుకున్న హీరోయిన్లలో తమన్నా భాటియా ముందుంటుంది. అలాగని ఈమెలో మంచి నటి లేదని చెప్పలేం. బాహుబలి లాంటి చిత్రాల్లో తమన్నా ఇరగదీసింది. అయితే ప్రతిభను చాటే అవకాశాలు ఎక్కువగా ఈమెకు రాలేదన్నది వాస్తవం. అందుకు కారణం ఈమెలోని అందం, అభినయాన్ని డామినేట్ చేయడమే. ఇక నిజం చెప్పుకోవాలంటే గ్లామరస్ పాత్రలే ఈ మిల్కీ బ్యూటీని ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఏదేమైనా 18 ఏళ్లుగా కథానాయకిగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అగ్ర కథానాయకిగా రాణిస్తున్న తమన్నా తాజాగా మలయాళం ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.
అక్కడ మరిన్ని అవకాశాలు వస్తున్నాయని అంటున్నారు కానీ, నిజానికి ఈ అమ్మడికి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. మరో పక్క ఇప్పటి వరకూ నటనపైనే దృష్టి పెట్టినట్లు స్టేట్‌మెంట్స్ ఇచ్చిన తమన్నా ఇప్పుడు తన బాయ్‌ఫ్రెండ్‌తో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తోందనిపిస్తోంది. బాలీవుడ్ నటుడు విజయవర్మతో చాలాకాలంగా సీక్రెట్ లవ్‌ను మెయింటైన్ చేస్తూ వచ్చిన ఈ బ్యూటీ ఇటీవలే తన ప్రేమ గుట్టును విప్పింది. ఆ తరువాత పార్టీలకు, ప్రైవేట్ ఫంక్షన్ లకు విచ్చలవిడిగా తిరిగే స్తున్నారు జంట. ఇక అసలు విషయానికి వస్తే ఈ సంచలన జంట కోసం పెళ్లి పీటలు ఎదురు చూస్తున్నాయని తాజా సమాచారం.
ఇప్పటివరకు చేసిన డేటింగ్ చాలు, ఇకనైనా పెళ్లి చేసుకోమని తమన్నా భాటియా ఇంట్లో ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. దీంతో బ్యూటీ కూడా తాళి కట్టు శుభవేళకు సిద్ధం అవుతున్నారనే టాక్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా దీపావళి పండుగను ఈ జంట కలిసి జరుపుకోవడం కూడా తమన్నా భాటియా పెళ్లికి సిద్ధం అవుతున్నట్లు వస్తున్న వార్తలకు బలాన్ని చేకూర్చుతోంది.
Comments
Please login to add a commentAdd a comment