‘‘ఏ బంధంలో అయినా ఇచ్చి పుచ్చుకోవడం ప్రధానం. కానీ గతంలో నా భాగస్వామి నేను ఇచ్చినదానిని స్వీకరించే స్థితిలో ఉన్నారో లేదో కూడా ఆలోచించకుండా ఎక్కువే ఇచ్చేదాన్ని. అయితే ఇది సరికాదు. అలాగని ఇప్పుడు ఇవ్వడం మానేస్తానని కాదు... ఇచ్చి పుచ్చుకోవడంలోనే ఓ అనుబంధం బలం తెలుస్తుంది’’ అంటున్నారు తమన్నా.
గతంలో తనకు రెండు ‘హార్ట్ బ్రేక్స్’ ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో పేర్కొని, ఈ విధంగా అన్నారామె. ఆ ఇంటర్వ్యూలో హార్ట్ బ్రేక్స్ గురించి తమన్నా మాట్లాడుతూ – ‘‘నా టీనేజ్‌లో ప్రేమలో పడ్డాను. అయితే అది సాగలేదు. ఎందుకంటే జీవితంలో ఏదో సాధించాలనే తపనతో ఉన్న నాకు ఒక వ్యక్తి కోసం జీవితాన్ని వదులుకోవాలనిపించలేదు. ఆ విధంగా తొలి హార్ట్ బ్రేక్ ఎదుర్కొన్నాను.
ఆ తర్వాత మరో వ్యక్తితో ప్రేమలో పడ్డాను. ఆ ప్రేమ కూడా ముగిసి΄ోయింది. ప్రతి చిన్న విషయానికీ అబద్ధం ఆడే వ్యక్తితో కొనసాగలేననిపించింది. ఆ విధంగా రెండో హార్ట్ బ్రేక్ ఎదురైంది’’ అన్నారు. ఇక ప్రస్తుతం నటుడు విజయ్ వర్మ–తమన్నా ప్రేమలో ఉన్నారనే వార్త ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment