
కోలీవుడ్ దర్శకుడు సుందర్.సీ చిత్రాలు కచ్చితంగా కమర్శియల్ అంశాలతో నిండి ఉంటాయి. ఇదే ఆయన సక్సెస్ ఫార్ములా అని చెప్పవ చ్చు. ఇకపోతే హార్రర్ కామెడీ నేపథ్యంలో ఈయన చేసిన చిత్రాలన్నీ విజయం సాధించాయి. ఇటీవల తమన్నా, రాశీ ఖన్నాలతో కలిసి సుందర్.సీ నటించి దర్శకత్వం వహించిన అరణ్మణై – 4 చిత్రం (తెలుగులో బాకు) మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం వసూళ్ల పరంగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిందని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు.
తాజాగా మరోసారి దర్శకుడు సుందర్.సీ- తమన్నా కాంబోలో ఒక చిత్రం తెరకెక్కనుందని తెలిసింది. దర్శకుడు శివ శిష్యుడు భూపాలన్ నటి తమన్నాకు ఒక కథ చెప్పారనీ, అది నచ్చడంతో ఆమె అందులో నటించడానికి సమ్మతించినట్లు సమాచారం. అయితే ఆ చిత్రాన్ని నిర్మించతలపెట్టిన సంస్థ ఆ కథను మాత్రం తీసుకుని సుందర్.సీ దర్శకత్వంలో నిర్మించాలని భావించగా, కథ నచ్చడంతో సుందర్.సీ కూడా దర్శకత్వం వహించడానికి సమ్మతించినట్లు తెలిసింది.

ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. దీంతో సుందర్.సీ, తమన్నాల హిట్ కాంబినేషన్ రీపీట్ కానుందన్నమాట. ఇకపోతే సుందర్.సీ ప్రస్తుతం తాను ఇంతకు ముందు రూపొందించిన కలగలప్పు చిత్రానికి సీక్కెల్‌ను చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. మరి ఈ రెండు చిత్రాల్లో దేన్ని ముందుగా చేస్తారో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.
Sticky for cinema
Comments
Please login to add a commentAdd a comment