'Bhola Shankar' Actress Tamannaah Childhood Pic - Sakshi
Sakshi News home page

Guess The Actress: కెరీర్ ఖతం అన్నారు! ఇప్పుడేమో ట్రెండింగ్‌లో

Published Sun, Jul 30 2023 8:17 PM | Last Updated on Mon, Jul 31 2023 9:44 AM

Bhola Shankar Actress Thamannah Childhood Pic  - Sakshi

యాక్టింగ్ చూడటానికి ఈజీగానే ఉంటుంది! కానీ చేస్తేనే అది ఎంత కష్టమో తెలుస‍్తుంది. అలానే ఈ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలబడాలంటే కష్టపడాలి, అదృష్టం కలిసి రావాలి. పైన ఫొటోలో కనిపిస్తున్న పాప కూడా అలానే టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ప్రారంభంలో చిన్న సినిమాలు చేసింది గానీ స్టార్ హీరోలతో చేసిన ఒకటి రెండు మూవీస్ హిట్ కావడంతో రేంజ్ పెంచేసుకుంది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? చెప్పేయమంటారా?

ఇండస్ట్రీలో హీరోయిన్లు మహా అయితే ఓ 10 ఏళ్లు వరసగా అవకాశాలు అందుకుంటారు. ఆ తర్వాత మాత్రం కష్టమే. కానీ ఈ హీరోయిన్ మాత్రం అప్పుడెప్పుడో 2005లో 'శ్రీ' సినిమాతో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టింది. ఇప్పటికీ ఈమె చేతిలో సినిమాలు, వెబ్ సిరీసులు ఉన్నాయి. అవును మీరు గెస్ చేసింది కరెక్టే. పైన ఫొటోలో ఉన్న పాప తమన్నా. త్వరలో ఈమె నటించిన 'జైలర్', 'భోళా శంకర్' సినిమాలు.. ఒక‍్క రోజు వ్యవధిలో థియేటర్లలోకి రాబోతున్నాయి.

(ఇదీ చదవండి: తమన్నాకు వింత పరిస్థితి.. ఒకే హీరోకి లవర్‌, సిస్టర్‌‌గా!)

గతేడాది పరిస్థితి చూసుకుంటే తమన్నా కెరీర్ ఆల్మోస్ట్ అయిపోయిందనుకున్నారు. ఈ సంవత్సం వచ్చేసరికి మొత్తం మారిపోయింది. 'జీ కర్దా', 'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీసుల్లో నటించిన మిల్కీబ్యూటీ.. అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేసింది. ఎందుకంటే ఇన్నాళ్లుగా స్క్రీన్ పై ముద్దు సీన్‌కి కూడా నో చెబుతూ వచ్చిన ఈ నటి.. ఓటీటీలు అనేసరికి ముద్దులు, శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి మరీ చేసింది. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో విడుదలకు రెడీ అయిపోయింది. 

మరోవైపు నటుడు విజయ్ వర్మతో ప్రేమ వ్యవహారంతోనూ తమన్నా తెగ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఎందుకంటే వీరిద్దరూ ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ (లస్ట్ స్టోరీస్ 2)లో అవాక్కయ్యేలా కెమిస్ట్రీ పండించేస్తున్నారు. ఇలా తమన్నా కెరీర్ ఖతం అయిందనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమెనే ట్రెండింగ్ లో ఉంటోంది. ఇప్పుడు ఆమె చిన్నప్పుడు ఫొటోలు కొన్ని వైరల్ అయ్యాయి.  వాటిని చూసిన నెటిజన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు.

(ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement