
సుడిగాలి సుధీర్.. బుల్లితెరపై ఈ పేరు తెలియని వారుండరేమో. పలు టీవీ షోలు, ఈవెంట్లతో పాపులారిటీ సంపాదించుకున్న సుధీర్ అతి తక్కువ కాలంలోనే బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు. ఇక యాంకర్ రష్మీతో కెమెస్ర్టీ కూడా సుధీర్‌కు బాగా కలిసొచ్చింది. దీంతో వీరిద్దరు కలిసి చేసిన పలు స్కిట్లు, ఈవెంట్లు సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరూ లవ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయంపై గతంలోనే ఇద్దరూ క్లారిటీ ఇచ్చినా ఆ రూమర్లకు మాత్రం తెరపడటం లేదు. ఇటీవలె సుధీర్ 34వ బర్త్‌డేను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మరోసారి వీరి పెళ్లి టాపిక్ తెరపైకి వచ్చింది.
అయితే తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం సుధీర్ ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదని, మరో రెండేళ్ల వరకు బ్యాచిలర్ లైఫ్‌ను ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. మరోవైపు బుల్లితెరపై సూపర్ సక్సెస్ అయిన సుధీర్‌కు వెండితెర అంతగా కలిసి రాలేదు. ఇప్పటికే సుధీర్ హీరోగా నటించిన సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. అయితే ప్రస్తుతం ఆయన రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో గాలోడు అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. సుధీర్ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ చిత్రానికి ‘గాలోడు’ అనే టైటిల్‌ను ప్రకటించారు.
చదవండి : Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఇంట్లో విషాదం
ఆ పనులు చేయడమంటే పిచ్చి ఇష్టం : నటి నవ్య స్వామి
Comments
Please login to add a commentAdd a comment