ట్రాన్స్‌జెండర్‌తో పెళ్లి.. కట్నంకోసం వేధింపులు | Man Dowry Harassment To Transgender Women In West Godavari District | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌జెండర్‌తో పెళ్లి.. కట్నంకోసం వేధింపులు

Published Sat, Feb 20 2021 11:03 AM | Last Updated on Sat, Feb 20 2021 12:49 PM

Man Dowry Harassment To Transgender Women In West Godavari District - Sakshi

సాక్షి, ఏలూరు: ఫేస్‌బుక్‌ పరిచయం కాస్త ప్రేమగా మారింది.. ట్రాన్స్‌జెండర్‌ అని తెలిసే ప్రేమాయణం సాగించాడు. ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ నువ్వు నాకు వద్దంటూ వేధింపులకు పాల్పడడంతో పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. ఇంతకీ అతను ఏలూరు సత్రంపాడుకు చెందిన యువకుడు కావటం ఆసక్తిగా మారింది. ఏలూరు సత్రంపాడుకు చెందిన తారక అలియాస్‌ పండు అనే యువకుడు హైదరాబాద్‌ ఎల్‌బీ నగర్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్‌ భూమితో ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యి ప్రేమించుకున్నారు.

అనంతరం 2020 జనవరిలో పెద్దలను ఒప్పించి మరీ భూమిని పెళ్లి చేసుకున్నాడు. ఇలా కొనసాగుతుండగా ఇద్దరి మధ్య చిన్నపాటి వివాదం ప్రారంభమైంది. కుటుంబ సభ్యుల ఒత్తిడితో యువకుడు భూమితో ఉండేందుకు నిరాకరించటంతోపాటు, అదనపు కట్నం తేవాలంటూ వేధింపులకు గురిచేశాడు. ఎల్‌బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడు తారకను అరెస్టు చేశారు. 

చదవండి: మృతదేహంతో దాదాపు 10 కిలో మీటర్లు
చదవండి: ముందు ఛాటింగ్‌ .. తర్వాత ఫోన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement