Sharwanand Met Chief Minister KCR, Invite Wedding Reception - Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శర్వానంద్‌ ఆహ్వానం

Published Thu, Jun 8 2023 8:19 PM | Last Updated on Thu, Jun 8 2023 8:38 PM

Sharwanand Met Chief Minister KCR Invite Wedding Reception - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌  హీరో శర్వానంద్ -రక్షితారెడ్డి జూన్‌ 3న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జైపుర్‌లోని లీలా ప్యాలెస్‌ వేదికగా వీరి పెళ్లి ఘనంగా జరిగింది. సుమారు రెండు రోజుల పాటు జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో రామ్‌చరణ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. కాగా, శర్వానంద్‌ ఫ్యామిలీ రేపు (జూన్‌ 9న) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ నిర్వహించనుంది.

(ఇదీ చదవండి: ‘చిరు లీక్స్‌’.. సంగీత్‌లో మెగాస్టార్‌ స్టెప్పులు)

ఈ నేపథ్యంలో  ముఖ్యమంత్రి కేసీఆర్‌ను శర్వానంద్ కలిశారు. రిసెప్షన్‌కు రావాలని ఆయనకు ఆహ్వానం అందించారు. శర్వానంద్‌ సతీమణి రక్షితారెడ్డి సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగిని అని తెలిసిందే.  ఇకపోతే ఈ హీరో సినిమాల విషయానికి వస్తే.. ‘ఒకే ఒక జీవితం’ విజయం తర్వాత  కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో రాశీఖన్నా లీడ్ రోల్‌లో నటిస్తుంది.

(ఇదీ చదవండి: వరుణ్‌- లావణ్య త్రిపాఠి పెళ్లిపై ఎవరూ స్పందించరేంటి?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement