నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. బాలయ్య సినీ ప్రస్థానం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించునున్నారు. ఈ వేడులకు హాజరు కావాలంటూ టీఎఫ్‌పీసీ, టీఎఫ్‌సీసీ, మా అసోసియేషన్ సభ్యులు బన్నీని కలిసి ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరలవుతోంది.
కాగా.. బన్నీ ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ చిత్రీకరణ చివరిదశలో ఉంది. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 6న థియేటర్లలో పుష్పరాజ్ సందడి చేయనున్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment