invitaion
-
బాలయ్య ఈవెంట్‌కు బన్నీకి ప్రత్యేక ఆహ్వానం!
నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. బాలయ్య సినీ ప్రస్థానం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించునున్నారు. ఈ వేడులకు హాజరు కావాలంటూ టీఎఫ్‌పీసీ, టీఎఫ్‌సీసీ, మా అసోసియేషన్ సభ్యులు బన్నీని కలిసి ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరలవుతోంది.కాగా.. బన్నీ ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ చిత్రీకరణ చివరిదశలో ఉంది. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 6న థియేటర్లలో పుష్పరాజ్ సందడి చేయనున్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. -
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన ఎన్ఆర్ఐ ప్రతినిధులు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారిని ఈనెల 23న సాయంత్రం రవీంద్రభారతిలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సేవ డేస్ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని కోరుతూ ఆ సంఘం అధ్యక్షులు వంశీ రెడ్డి, ప్రతినిధులు మలిపెద్ది నవీన్, కవితా రెడ్డి,సురేష్ రెడ్డి,గణేష్, జ్యోతిరెడ్డి, మనోజ్ రెడ్డి, దుర్గాప్రసాద్,మనోహర్ తదితరులు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో కలిసి ఆహ్వానించారు. డిసెంబర్ 10 నుంచి ఈనెల 23 వరకు రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి వారు డిప్యూటీ సీఎంకు వివరించారు. వరంగల్ లో 38 కంపెనీల సహకారంతో జాబ్ మేళా నిర్వహించగా 16,000 మంది హాజరయ్యారని ఇందులో 1500 మంది నిరుద్యోగులను ఎంపిక చేసామని చెప్పారు.అదే విధంగా 2024 మే 24 నుంచి 26 వరకు అమెరికాలోని వాషింగ్టన్ లో నిర్వహించే తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మహాసభలకు కూడా రావాలని విజ్ఞప్తి చేశారు. (చదవండి: ఘనంగా ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సు!) -
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ -రక్షితారెడ్డి జూన్ 3న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జైపుర్‌లోని లీలా ప్యాలెస్ వేదికగా వీరి పెళ్లి ఘనంగా జరిగింది. సుమారు రెండు రోజుల పాటు జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో రామ్‌చరణ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. కాగా, శర్వానంద్ ఫ్యామిలీ రేపు (జూన్ 9న) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించనుంది. (ఇదీ చదవండి: ‘చిరు లీక్స్’.. సంగీత్‌లో మెగాస్టార్ స్టెప్పులు) ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను శర్వానంద్ కలిశారు. రిసెప్షన్‌కు రావాలని ఆయనకు ఆహ్వానం అందించారు. శర్వానంద్ సతీమణి రక్షితారెడ్డి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అని తెలిసిందే. ఇకపోతే ఈ హీరో సినిమాల విషయానికి వస్తే.. ‘ఒకే ఒక జీవితం’ విజయం తర్వాత కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో రాశీఖన్నా లీడ్ రోల్లో నటిస్తుంది. (ఇదీ చదవండి: వరుణ్- లావణ్య త్రిపాఠి పెళ్లిపై ఎవరూ స్పందించరేంటి?) -
జీ-7: ఎట్టకేలకు ప్రధాని మోదీకి ఆహ్వానం
బెర్లిన్: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న వేళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ ఏడాది జూన్‌లో(26-28 తేదీలు) జీ-7 దేశాల సదస్సు బవేరియన్ ఆల్ప్స్లో జరుగనుంది. ఈ సదస్సును జర్మనీ నిర్వహిస్తోంది. అయితే, ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం సందర్భంగా భారత్ అనుసరిస్తున్న వైఖరి కారణంగా ఈ జీ-7 సమావేశాలకు జర్మనీ.. ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించడం లేదనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే.. ఈ వార్తలను తోసిపుచ్చుతూ భారత్‌కు ఆహ్వానం పంపిస్తున్నట్టు జర్మనీ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. త్వరలోనే భారత్‌కు ఆహ్వానం అందనున్నట్టు పేర్కొంది. కాగా, యుద్ధం వేళ యూఎన్ మానవ హక్కుల మండలి నుంచి రష్యాను బహిష్కరించే సమయంలో జరిగిన ఓటింగ్‌లో భారత్ పాల్గొనలేదు. మరోవైపు.. రష్యా నుంచి చమురు కొనుగోలు అంశంలో కూడా భారత్ సానుకూలంగా స్పందించింది. యుద్ధం జరుగుతున్న సయమంలోనే రష్యా విదేశాంగ మంత్రి భారత్‌లో పర్యటించడం ఇండియాకు పలు ఆఫర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వీటన్నింటి కారణంగా ఈ ఏడాది భారత్‌కు ఆహ్వానం అందడం లేదనే వార్తలు జాతీయ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అన్నింటికి చెక్ పెడుతూ జర్మనీ కీలక ప్రకటన చేసింది. అయితే, 2019 నుండి G7 శిఖరాగ్ర సమావేశానికి భారతదేశాన్ని వరుసగా ఆహ్వానించడం ఇది నాల్గవసారి. 2020 జూన్‌లో సమ్మిట్ జరగాల్సి ఉండగా కరోనా కారణంగా సదస్సు జరగలేదు. 2021లో యూకేలో జరిగే శిఖరాగ్ర సమావేశానికి భారతదేశాన్ని ఆహ్వానించింది. ఆ సమయంలో యూకేలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రధాని మోదీ వర్చువల్‌గా సమ్మిట్‌లో పాల్గొన్నారు. మరోవైపు.. ఈ ఏడాది జరగబోయే జీ-7 సదస్సుకు సెనిగల్, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా దేశాలను ఇప్పటికే జర్మనీ ఆహ్వానించింది. -
వైరల్ అవుతోన్న విక్ట్రీనా వెడ్డింగ్ రిసెప్షన్ హాంపర్, అందులో ఏం ఉన్నాయంటే..
Katrina Kaif And Vicky Kaushal Wedding Reception Hamper Goes Viral: బాలీవుడ్ లవ్‌బర్డ్స్ విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. గురువారం(డిసెంబర్ 9) రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో విక్ట్రీనా (విక్కీ కౌశల్, కత్రినా కైఫ్) పెళ్లి ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని అధికారికంగా విక్ట్రీనాలు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు తమ పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ.. ‘‘మా మనసులో ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమే మమ్మల్ని ఇంతదాకా తీసుకువచ్చింది. మా ఈ కొత్త ప్రయాణానికి అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుతున్నాం’’ అంటూ పోస్ట్ షేర్ చేశారు. చదవండి: బయటకొచ్చిన కత్రినా-విక్కీల హల్ది ఫంక్షన్ ఫొటోలు పెళ్లి అనంతరం తమ హల్ది ఫంక్షన్ ఫొటోలను షేర్ చేశారు విక్ట్రీనా. ఈ క్రమంలో వీరి వెడ్డింగ్ రిసెప్షన్ ఇన్విటేషన్ కార్డు వైరల్ అవుతోంది. కాగా ప్రముఖులకు విక్ట్రీనా రిసెప్షన్‌కు ఆహ్వానం పంపించినట్లు జోరుగ ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్‌లో కొద్దిమంది బంధువులు, కుటుంబసభ్యులు, కొద్ది మంది వీఐపీల మధ్య వీరి వివాహ వేడుక జరిగింది. ఈ నేపథ్యంలో పరిశ్రమకు చెందిన సెలబ్రెటీలందరికి, ప్రముఖుల కోసం ముంబైలోని ఓ స్టార్ హోటల్ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. చదవండి: ఎట్టకేలకు స్పందించిన విక్ట్రీనా, ఒక్కటయ్యామంటూ అధికారిక ప్రకటన ఈ నేపథ్యంలో బి-టౌన్ సెలెబ్రెటీలకు, సినీ ప్రముఖులకు విక్ట్రీనా ఆహ్వానం పింపినట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ విక్ట్రీనా వెడ్డింగ్ రెసెప్షన్ ఇన్విటేషన్ హాంపర్ ఇదేనంటూ పలు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఈ ఇన్విటేషన్ హాంపర్ పూర్తిగా పింక్ కలర్ పూలతో నిండి ఉంది. ఇక ఇందులో నెయ్యితో చేయించిన స్పెషల్ లడ్డు ఇతర స్వీట్స్‌తో పాటు డ్రైఫ్రూట్స్‌తో రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. చూస్తుంటే కళ్లే చెదిరేలా ఉన్న ఈ హాంపర్‌తో విక్ట్రీనాలు పలువురికి ఆహ్వానం పంపినట్లు సమాచారం. అయితే ఇది విక్ట్రీనాలకు సంబంధించిందా లేదా అనే దానిపై ఖచ్చితమైన సమాచారం లేదు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఇషా - ఆనంద్ వెడ్డింగ్ కార్డ్ వైరల్ వీడియో
సాక్షి, ముంబై: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, నీతాల ముద్దుల తనయ ఇషా అంబానీల రాయల్ వెడ్డింగ్ వేడుక అంశం మరోసారి వార్తల్లోకొచ్చింది. త్వరలోనే అంగరంగ వైభవంగా జరగనున్న ఇషా, ఆనంద్ పిరామల్ (ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ పిరామల్ ఇండస్ట్రీస్ చైర్మన్ అజయ్ పిరామల్ తనయుడు) మూడుముళ్ల సంబరానికి శుభముహూర్తం దగ్గరపడుతోంది. అత్యంతఘనంగా నిశ్చాతార్థ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న వీరి వివాహ ఈ వేడుక కోసం దేశీయ మీడియాతోపాటు అంతర్జాతీయ మీడియాకూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో వీరి పెళ్లి శుభలేఖకు సంబంధించిన వీడియో ఒకటి నెట్ లో చక్కర్లు కొడుతోంది. కార్పొరేట్ కుటుంబాలకు తగినట్టుగా నాలుగు చిన్న బంగారు బాక్సుల్లో, అందంగా అమర్చిన అమ్మవారి చిత్రంతో రూపుదిద్దుకున్న ఈ గోల్డెన్ కార్డు ఆహ్వానితులను ఆకట్టుకోనుంది. కాగా డిసెంబర్10న పెళ్లి పీటలెక్కనున్న ఇషా అంబానీ-ఆనంద్ పిరమల్ వివాహ వేడుకుకు సంబంధించి ఇప్పటికే పలు వార్తలు నెటిజనులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించనున్న సంగీత్ కార్యక్రమంలో ప్రముఖ ఇంటర్నేషనల్ పాప్ స్టార్ బియాన్సే ప్రదర్శన ఇవ్వనున్నారనీ, ఇందుకు ఆమెకు భారీగానే ( రూ.15 కోట్లు) పారితోషికం ఆఫర్ చేశారట. ఈ లవ్‌బర్డ్స్ నిశ్చితార్థ కార్యక్రమాన్ని గత నెలలో ఇటలీలో అధికారికంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ईशा अंबानी-आनंद पीरामल की शाही शादी का कार्ड, खुलते ही होंगे इस देवी के दर्शन#IshaAmbani #Ambani #IshaAnandambani #WeddingInvite pic.twitter.com/CbCVR56djW — Whats In The News (@_whatsinthenews) November 5, 2018 -
బీజేపీ ఆహ్వానిస్తే ఆలోచిస్తాం
- కేంద్రంలో చేరికపై ఎంపీ కవిత వ్యాఖ్య న్యూఢిల్లీ: బీజేపీ ఆహ్వానిస్తే కేంద్రలో చేరడంపై తమ పార్టీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. తాము కేంద్రంలో చేరుతామన్న వార్తలు కేవలం ఊహాగానాలే అని, ఇప్పుడే దీనిపై మాట్లాడడం సరికాదని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీలో బుధవారం కేంద్ర మంత్రులు చౌదరి బీరేంద్రసింగ్, నిర్మలా సీతారామన్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేసినట్లు కవిత చెప్పారు. అయితే పసుపు బోర్డు ఏర్పాటుకు కొంత సమయం పడుతుందని, ఈ లోపు నిజామాబాద్‌లో సుగంధ ద్రవ్యాల పార్క్‌ను ఏర్పాటు చేస్తామని సీతారామన్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలు వెనుకబడినవని, వీటి అభివృద్ధికి నిధులు కేటాయించాలని బీరేంద్రసింగ్‌ను కోరానని, వీలైనంత నిధులు కేటాయించేందుకు ప్రయత్నిస్తామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు.