Katrina Kaif And Vicky Kaushal Marriage Reception Hamper To Invite Celebrities, Goes Viral - Sakshi
Sakshi News home page

Vicky Kaushal-Katrina Kaif Reception: ముంబై స్టార్‌ హోటల్లో విక్ట్రీనా వెడ్డింగ్‌ రిసెప్షన్‌, బాలీవుడ్‌కు ఆహ్వానం!

Published Sun, Dec 12 2021 1:05 PM | Last Updated on Sun, Dec 12 2021 1:50 PM

Is Katrina Kaif, Vicky Kaushal Send Wedding Reception Hamper To Bollywood Celebs - Sakshi

Katrina Kaif And Vicky Kaushal Wedding Reception Hamper Goes Viral: బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ విక్కీ కౌశల్- కత్రినా కైఫ్‌ ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. గురువారం(డిసెంబర్‌ 9) రాజస్థాన్‌లోని సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ బర్వారాలో విక్ట్రీనా (విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌) పెళ్లి ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని అధికారికంగా విక్ట్రీనాలు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు తమ పెళ్లి ఫొటోలను షేర్‌ చేస్తూ.. ‘‘మా మనసులో ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమే మమ్మల్ని ఇంతదాకా తీసుకువచ్చింది. మా ఈ కొత్త ప్రయాణానికి అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుతున్నాం’’ అంటూ పోస్ట్‌ షేర్‌ చేశారు.

చదవండి: బయటకొచ్చిన కత్రినా-విక్కీల హల్ది ఫంక్షన్‌ ఫొటోలు

పెళ్లి అనంతరం తమ హల్ది ఫంక్షన్‌ ఫొటోలను షేర్‌ చేశారు విక్ట్రీనా. ఈ క్రమంలో వీరి వెడ్డింగ్‌ రిసెప్షన్‌ ఇన్విటేషన్‌ కార్డు వైరల్‌ అవుతోంది. కాగా ప్రముఖులకు విక్ట్రీనా రిసెప్షన్‌కు ఆహ్వానం పంపించినట్లు జోరుగ ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్‌లో కొద్దిమంది బంధువులు, కుటుంబసభ్యులు, కొద్ది మంది వీఐపీల మధ్య వీరి వివాహ వేడుక జరిగింది. ఈ నేపథ్యంలో పరిశ్రమకు చెందిన సెలబ్రెటీలందరికి, ప్రముఖుల కోసం ముంబైలోని ఓ స్టార్‌ హోటల్‌ గ్రాండ్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేసినట్లు సమాచారం. 

చదవండి: ఎట్టకేలకు స్పందించిన విక్ట్రీనా, ఒక్కటయ్యామంటూ అధికారిక ప్రకటన

ఈ నేపథ్యంలో బి-టౌన్‌ సెలెబ్రెటీలకు, సినీ ప్రముఖులకు విక్ట్రీనా ఆహ్వానం పింపినట్లు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ విక్ట్రీనా వెడ్డింగ్‌ రెసెప్షన్‌ ఇన్విటేషన్‌ హాంపర్‌ ఇదేనంటూ పలు ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ప్రత్యేకంగా డిజైన్‌ చేయించిన ఈ ఇన్విటేషన్‌ హాంపర్‌ పూర్తిగా పింక్‌ కలర్‌ పూలతో నిండి ఉంది. ఇక ఇందులో నెయ్యితో చేయించిన స్పెషల్‌ లడ్డు ఇతర స్వీ‍ట్స్‌తో పాటు డ్రైఫ్రూట్స్‌తో రిటర్న్‌ గిఫ్ట్స్‌ ఇస్తున్నట్లు తెలుస్తోంది. చూస్తుంటే కళ్లే చెదిరేలా ఉన్న ఈ హాంపర్‌తో విక్ట్రీనాలు పలువురికి ఆహ్వానం పంపినట్లు సమాచారం. అయితే ఇది విక్ట్రీనాలకు సంబంధించిందా లేదా అనే దానిపై ఖచ్చితమైన సమాచారం లేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement