కమెడియన్‌గా రాకింగ్ రాకేశ్(Rocking Rakesh) హీరోగా నటించి నిర్మించిన సినిమా కేసీఆర్ (KCR Movie). గతనెల 22న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కేసీఆర్ అలియాస్ 'కేశవ చంద్ర రమావత్' సినిమాకు గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, కొత్తగా ఏర్పడిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికైన పరిణామాలకు ఓ లంబాడీ యువకుడి జీవిత ప్రయాణాన్ని జోడించి ఈ మూవీని తెరకెక్కించారు.
నటి సత్య కృష్ణన్ కూతురు అనన్య కృష్ణన్ (Ananya Krishnan) ఈ చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 28 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే స్ట్రీమింగ్ తేదీని ప్రకటించిన మేకర్స్.. తాజాగా ఓటీటీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
అసలు కథేంటంటే..
'కేసీఆర్' కథ విషయానికొస్తే.. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న రోజుల్లో కేసీఆర్ ప్రసంగాలు విని అతడికి అభిమాని అవుతాడు కేశవ చంద్ర రమావత్ (రాకింగ్ రాకేష్). ఊరివాళ్లంతా కేశవ చంద్రరమావత్‌ను కేసీఆర్ అని పిలుస్తుంటారు. కేశవను అతడి మరదలు మంజు (అనన్య కృష్ణన్) ఇష్టపడుతుంది. బావనే పెళ్లిచేసుకోవాలని కలలు కంటుంది. మరదల్ని కాదని కేశవ చంద్ర రమావత్ బాగా డబ్బున్న అమ్మాయితో పెళ్లికి సిద్ధపడతాడు.
తన పెళ్లి అభిమాన నాయకుడు కేసీఆర్ చేతుల మీదుగా జరగాలని కేశవ చంద్ర కలలు కంటాడు. కేసీఆర్‌ను కలవడం కోసం హైదరాబాద్ వస్తాడు. ఆ తర్వాత ఏమైంది? కేశవ చంద్ర రమావత్.. కేసీఆర్‌ను కలిశాడా? తమ ఊరికి ఎదురైన రింగ్ రోడ్ సమస్యని ఇతడు ఎలా పరిష్కరించాడు? మరదలి ప్రేమను అర్థం చేసుకున్నాడా అనేదే మూవీ స్టోరీ.
Comments
Please login to add a commentAdd a comment