'కేజీయఫ్'తో వెండితెరకు ఎంట్రీ ఇచ్చి.. రీనాగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేసింది. కేజీఎఫ్ చాప్టర్ 1కు సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఈ చిత్రంలో యశ్‌కు జోడీగా నటించిన శ్రీనిధి పాత్రకు అనేక ప్రశంసలు దక్కాయి. తొలి సినిమాతోనే స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్న శ్రీనిధికి మొదట్లో వరుస అవకాశాలు వచ్చినా తర్వాత వెనుకబడిపోయింది.
(ఇదీ చదవండి: Allu Arha In Devara: దేవుడా.. రెండో సినిమాకే లక్షలు తీసుకుంటున్న అల్లు అర్హ!)
సోషల్ మీడియాలో తన అభిమానులకు టచ్‌లో ఉంటూ పలు ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా శ్రీనిధి కొన్ని ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అవి నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు శ్రీనిధి శెట్టి సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కానీ ఇందులో వారి తప్పేంలేదని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అసలు విషయం వేరే ఉంది. ఆమె పోస్ట్ చేసిన ఫోటోలలో నుదుటిన పాపిట్లో సిందూరంతో బొట్టు పెట్టుకొని కనిపించడమే ఈ ప్రచారానికి బలాన్ని చేకుర్చింది.
సాదారణంగా పెళ్లి అయిన అమ్మాయిలు మాత్రమే నుదుటన పాపిట్లో బొట్టు పెట్టుకుంటారు కాబట్టి శ్రీనిధి కూడా పెళ్లి చేసుకుందని ఆ ఫోటోలను షేర్ చేస్తున్నారు. కానీ ఈ ప్రచారంలో నిజం లేదని తెలుస్తోంది. కర్ణాటకలోని కిన్నిగోలికి చెందిన తుళు కుటుంబంలో శ్రీనిధి జన్మించింది. వారి సంప్రదాయం ప్రకారం కొంతమంది అమ్మాయిలు కూడా ఇలా పెళ్లి కాకుండానే పాపిట్లో బొట్టు పెట్టుకుంటారని తెలుస్తోంది. అందువల్లే శ్రీనిధి శెట్టి కూడా నుదుటన బొట్టు పెట్టుకుందని చెబుతున్నారు. కాబట్టి ఆమె పెళ్లిపై ప్రచారం చేయడం ఇంతటితోనైనా ఆపేయండని ఆమెను అభిమానించేవారు నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.
సినిమా అవకాశాలు ఎందుకు రాలేదు
కొత్త ప్రాజెక్టులలో ఆమె కనిపించకపోవడానికి కారణం శాండల్‌వుడ్‌లో ఇలా టాక్ వినిపిస్తోంది. శ్రీనిధి శెట్టి మంచి పొడగరి .. ఆకర్షణీయమైన రూపంతో ఉంటుంది. ఒక రకంగా ఆమె ప్రయత్నంచేస్తే.. అనుష్కలా టాలీవుడ్‌ను ఏలేయోచ్చు.. అయితే ఆమె పెర్పామెన్స్ చూపించేలా సినిమా ఒక్కటి కూడా పడలేదు. కేజీయఫ్ బ్రాండ్ పెట్టుకుని రెమ్యునరేషన్ రేటుపెంచేసరికి నిర్మాతలు ఆమెను సినిమాలు అడగటమే మానేశారట. అసలు ఆమె హైట్, బ్యూటీకి.. ప్రభాస్ .. మహేశ్ వంటి హీరోల సరసన ఆమెను చూడాలని అభిమానులు ఆశపడుతుంటే, ఆమె మాత్రం పారితోషికం విషయంలో దిగిరావడం లేదనే అప్పట్లోనే టాక్ వినిపించేది.
(ఇదీ చదవండి: అందరూ వైష్ణవినే తిడుతున్నారు: బేబీ నిర్మాత)
Comments
Please login to add a commentAdd a comment