KGF Heroine Srinidhi Shetty Losing Movie Offers Due To Remuneration Hikes - Sakshi
Sakshi News home page

అత్యాశ..అవకాశాల్లేవు.. కేజీయఫ్‌ బ్యూటీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Published Sun, Jun 26 2022 2:09 PM | Last Updated on Sun, Jun 26 2022 3:04 PM

KGF Heroine Srinidhi Shetty Losing Movie Offers Due To Remuneration Hikes - Sakshi

హీరోకి ఎంత స్టార్ డమ్ ఉన్నప్పటికీ ఒక భాషకి చెందిన సినిమాలనే చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. అదే హీరోయిన్స్ అయితే ఓ అరడజను భాషల్లో ప్రాజెక్టులను చుట్టబెట్టేస్తూ ఉంటారు. కేజీయఫ్‌ బ్రాండ్ తో శ్రీనిథి శెట్టి కూడా అలానే చేయాలి అనుకుంది. అసలే కన్నడ ఇండస్ట్రీ హీరోయిన్ల ఫ్యాక్టరీలా మారిపోయింది. ఇలానే తను కూడా టాలీవుడ్ కి వచ్చి వెలుగు వెలగాలనిచూసింది.

(చదవండి: టార్గెట్‌ సంక్రాంతి... బాక్సాఫీస్‌ బరిలో చిరు, పవన్‌, ప్రభాస్‌)

ఇప్పటికే కన్నడ నుంచి అరడజనుకు పైగా కొత్త తారలు టాలీవుడ్ లో ఊపేస్తున్నారు. సౌందర్య, అనుష్క, ప్రేమ లాంటి వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ లిస్ట్ లో చేరాలని ప్రయత్నం చేసిందిశ్రీనిథి శెట్టి. కాని ఆమె అనుకున్న ఆశలకు ఆమె నిర్ణయమే గండి కొట్టినట్టు తెలుస్తోంది. కేజీయఫ్  సినిమా తరువాత పారితోషికాన్ని భారీగా పెంచింది శ్రీనిధి.  కేజీఎఫ్ 2 కూడా సంచలన విజయాన్ని సాధించడంతో పారితోషికాన్ని మరింత పెంచిందట. ఇంత వరకూ ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువ. కేజీయఫ్ లో ఆమె పాత్ర కూడా చాలా తక్కువే. అయినా ఆమె తన పారితోషికాన్ని ఒక రేంజ్ లో పెంచడంతో నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారట.

కొత్త ప్రాజెక్టులలో ఆమె కనిపించకపోవడానికి కారణం ఇదేనని శాండల్‌వుడ్‌ లో టాక్  వినిపిస్తోంది. శ్రీనిధి శెట్టి మంచి పొడగరి .. ఆకర్షణీయమైన రూపం తో ఉంటుంది. ఒక రకంగా ఆమె ప్రయత్నంచేస్తే.. అనుష్కలా టాలీవుడ్ ను ఏలేయోచ్చు.. అయితే ఆమె పెర్పామెన్స్  చూపించేలా సినిమా ఒక్కటి కూడా పడలేదు. కేజీయఫ్ బ్రాండ్ పెట్టుకుని రేటుపెంచేసరికి నిర్మాతలు ఆమెను సినిమాలు అడగటమే మానేశారట. అసలు ఆమె హైట్, బ్యూటీకి..  ప్రభాస్ .. మహేశ్ వంటి హీరోల సరసన ఆమెను చూడాలని అభిమానులు ఆశపడుతుంటే,  ఆమె మాత్రం పారితోషికం విషయంలో దిగిరావడం లేదనే టాక్ వినిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement