KGF Heroine Srinidhi Shetty Latest Photoshoot Viral - Sakshi
Sakshi News home page

Srinidhi Shetty Photos: వైరల్‌గా కేజీయఫ్‌ బ్యూటీ శ్రీనిధి ఫొటోషూట్‌

Apr 27 2022 3:43 PM | Updated on Apr 27 2022 4:38 PM

KGF Heroine Srinidhi Shetty Latest Photoshoot Viral - Sakshi

కేజీఎఫ్‌ సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు క్రియేట్‌ చేసింది. 

బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలు కొట్టిన కేజీయప్‌ చాప్టర్‌ 1కు సీక్వెల్‌గా వచ్చిన కేజీయఫ్‌ చాప్టర్‌ 2 ఇటీవలె రిలీజ్‌ అయి మరోసారి కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఈ చిత్రంలో యశ్‌కు జోడీగా నటించిన శ్రీనిధి పాత్రకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.

తొలి సినిమాతోనే స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్న శ్రీనిధికి వరస అవకాశాలు క్యూ కడుతున్నాయి. త్వరలోనే కోబ్రా అనే సినిమాతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్‌ దశలో ఉంది.

ఇక ఈ సినిమా రిలీజ్‌ అనంతరం తెలుగు సినిమాలపై దృష్టి పెడతానంటోంది ఈ బ్యూటీ. ఇప్పటికే తెలుగు భాషపై పట్టు సాధించానని, త్వరలోనే టాలీవుడ్‌ తప్పకుండా సినిమా చేస్తానని ఇటీవల ఓ ఇంటర్య్వూలో చెప్పింది. 

మోడల్‌గా కేరీర్‌ను ప్రారంభించిన శ్రీనిధి కేజీయఫ్‌ తొలి సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కేజీయఫ్‌ చాప్టర్‌ 1 పాన్‌ ఇండియా సినిమాగా సత్తా చాటింది. దీంతో కేజీయఫ్‌ చాప్టర్‌ 2పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. 

ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 14న వచ్చిన కేజీయఫ్‌ 2 అంచనాలను మించి సూపర్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. విడుదలైన 12 రోజుల్లోనే ఈ మూవీ రూ. 900 కోట్లకు పైగా వసూళు చేసి 1000 కోట్ట క్లబ్‌లోకి చేరువలో ఉంది. 

ఇక  ప్రస్తుతం కేజీఎఫ్‌ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న ఈ బ్యూటీ వరసగా ఫొటోషూట్‌లకు ఫోజులు ఇస్తోంది. దీంతో ఆమె బ్యూటీఫుల్‌ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement