
కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన ఈ సినిమా సీక్వెల్ ఇటీవలె రిలీజ్ అయి మరోసారి కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఈ చిత్రంలో యశ్‌కు జోడీగా నటించిన శ్రీనిధి పాత్రకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.
అతి తక్కువ కాలంలోనే హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీనిధికి ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నాయి. త్వరలోనే కోబ్రా అనే సినిమాతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా రిలీజ్ అనంతరం తెలుగు సినిమాలపై దృష్టి పెడతానని పేర్కొంది. త్వరలోనే తప్పకుండా తెలుగు సినిమాలు చేస్తానని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment