ప్రియురాలితో బిగ్‌ బాస్‌ ఫేమ్‌ మహేశ్ విట్టా పెళ్లి.. ఫోటోలు వైరల్‌ | Bigg Boss Fame Mahesh Vitta Got Married With Shravani - Sakshi
Sakshi News home page

Mahesh Vitta Marriage: ప్రియురాలితో బిగ్‌ బాస్‌ ఫేమ్‌ మహేశ్ విట్టా పెళ్లి.. శ్రావణి రెడ్డి వివరాలు ఇవే

Published Tue, Sep 5 2023 7:14 AM | Last Updated on Wed, Sep 6 2023 10:08 AM

Bigg Boss Fame Mahesh Vitta Marriage With Shravani - Sakshi

టాలీవుడ్‌ కమెడీయిన్‌, బిగ్‌ బాస్‌ ఫేమ్‌ మహేశ్ విట్టా అందరికీ  పరిచయమే..టాలీవుడ్‌లో అంచెలంచెలుగా ఒక స్థాయికి చేరిన నటుడు మహేశ్. తొలి రోజుల్లో అవకాశాల కోసం ఎంతో కష్టపడి సొంత నిర్మాణ సంస్థను స్థాపించే స్థాయికి చేరాడు. బిగ్ బాస్ 3 రియాల్టీ షోలో పాల్గొని ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మహేశ్‌ రాయలసీమ యాసలో మాట్లాడుతూ వెండితెరపై తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నాడు.

(ఇదీ చదవండి: హీరోయిన్‌ స్నేహకు గోల్డెన్‌ ఛాన్స్‌.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ..!)

తాజాగా మహేశ్‌ తన ప్రియురాలు శ్రావణి రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. ప్రొద్దుటూరులో హెల్త్ క్లబ్ ఫంక్షన్ హాల్‌లో వారిద్దరి కళ్యాణ వేడుక వైభవంగా జరిగింది. మహేష్ విట్టా-శ్రావణిల పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశాడు. బిగ్ బాస్ హౌస్‌లో ఉండగానే తన లవ్ స్టోరీని మహేశ్‌ రివీల్‌ చేసిన విషయం తెలిసిందే.. కానీ అప్పట్లో ఆమె పేరును మాత్రం బయటకు చెప్పలేదు. శ్రావణి రెడ్డిని సుమారు  ఐదేళ్లుగా ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. ఆమె తన చెల్లెలు ఫ్రెండే అని కూడా మహేశ్‌ చెప్పాడు.

మొదట్లో అతని ప్రేమను శ్రావణి రిజెక్ట్‌ చేసినా పట్టువదలని విక్రమార్కుడిలా ఆమె  ప్రేమను సాధించానని మహేశ్‌ చెప్పిన విషయం తెలిసిందే. రెండేళ్లు తామిద్దరం స్నేహితులుగా ఉన్నామని.. ఆ తర్వాత తన ప్రేమకు శ్రావణి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని పేర్కొన్నాడు.  శ్రావణి రెడ్డి ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా.. మహేశ్‌ పలు సినిమాల్లో రానిస్తున్నాడు.

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement